Akhil: ఆ డైరెక్టర్ అయినా అయ్యగారికి హిట్ ఇస్తాడా..?

అఖిల్ అక్కినేని ఏ క్షణాన హీరోగా తెరంగేట్రం చేశాడో గానీ, చేసిన ఏ ఒక్క సినిమా కలిసి రావట్లేదు. ఆ మధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓకే అనిపించినా, అది అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయింది. ఇటీవల భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. షూటింగ్ మొదలైన నాటి నుండి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు రెండేళ్లకు విడుదలైంది. ట్రైలర్ తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని భావించిన ఈ సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది.

ఏజెంట్ డిజాస్టర్ అవటంతో డీలా పడ్డ అఖిల్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండనుందని సమాచారం అందుతుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ రానున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

కమర్షియల్ సినిమాలతో పాపులర్ అయిన వంశీ పైడిపల్లి, ఇటీవలే వారసుడు సినిమా ద్వారా పాన్ ఇండియా అటెంప్ట్ చేసి ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయాయడు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కోసం వంశీ ఎలాంటి కథ సిద్ధం చేస్తాడో చూడాలి. నాగార్జున కి ఊపిరి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన పైడిపల్లి అఖిల్ కూడా హిట్ ఇస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఏజెంట్ కోసం రెండేళ్ల పాటు సిక్స్ పాక్ మెయింటైన చేసి శ్రమించిన అఖిల్ ఈ సినిమా కోసం ఎలాంటి మేకోవర్ తో వస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు