Kushi: ఆ సినిమా ఈ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

సినీరంగంలో ఒక్క శుక్రవారం చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అప్పటివరకు వరుస హిట్స్ తో ఉన్నవారు ఒక్క డిజాస్టర్ తో అదఃపాతాళానికి పడిపోవటం, అప్పటివరకు వరుస డిజాస్టర్స్ తో కొట్టుమిట్టాడిన వారు ఒక్క బ్లాక్ బస్టర్ తో టాప్ పొజిషన్ కి చేరిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఖుషి సినిమా గురించి చెప్పడానికి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్ల కెరీర్లకు చాలా కీలకం అని చెప్పాలి. లైగర్ డిజాస్టర్ తర్వాత డీలా పడ్డ విజయ్ దేవరకొండ నుండి వస్తున్న సినిమా కావటంతో విజయ్ కెరీర్ కి ఈ సినిమా హిట్ అవ్వటం చాలా అవసరం.

ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా డిజాస్టర్ చవి చుసిన సమంతకి కూడా ఖుషి సినిమా హిట్ అవ్వటం చాలా ముఖ్యం. నాగచైతన్యతో విడాకుల తర్వాత నుండి అటు అక్కినేని అభిమానులు, ఇటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న సమంతకి శాకుంతలం తర్వాత ట్రోల్స్ మరింత పెరిగాయి. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ అందుకొని తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాలని సమంత భావిస్తోంది.

దర్శకుడు శివ నిర్వాణ తొలి రెండు సినిమాలు నిన్నుకోరి, మజిలీ డీసెంట్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే తర్వాత వచ్చిన టక్ జగదీష్ ఫ్లాప్ అవ్వటం వల్ల ఖుషి సినిమాతో ఎలా అయిన హిట్ అందుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ రకంగా ఈ ఒక్క సినిమా ముగ్గురి జాతకాలు ప్రభావితం చేయనుందన్న మాట. సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు