మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ, ఒక్క సినిమాలో కూడా వింటేజ్ చిరంజీవి కనిపించలేదన్న అసంతృప్తి అటు మెగా అభిమానుల్లో, నార్మల్ ఆడియెన్స్ లో ఉందన్న మాట వాస్తవం. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాలో అక్కడక్కడా వింటేజ్ మెగాస్టార్ కనిపించినప్పటికీ పదేళ్లకు పైగా తమ డెమీ గాడ్ ని సిల్వర్ స్క్రీన్ మీద మిస్సైన లోటుతో థియేటర్స్ కి వచ్చిన ఫ్యాన్స్ కి ఖైదీ నంబర్ 150 నుండి ఆ లోటు రిపీట్ అవుతూ వస్తోంది.
వయసు మీద పడుతున్నప్పటికీ డ్యాన్స్ లో మునుపటి గ్రేస్ తో అలరిస్తున్న చిరంజీవి కామెడీ టైమింగ్, తనకంటూ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఈజ్ ని మునుపటిలాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయటంలో సక్సెస్ కాలేకపోతున్నాడు అన్నది సగటు మెగా అభిమాని ఆవేదన. అయితే, బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో చిరంజీవి చేయనున్న సినిమా స్టోరీ విషయంలో వినిపిస్తున్న వార్తలతో అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సోషియో ఫాంటసీ జానర్లో రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి ముల్లోకాలను చుట్టి వచ్చే సీక్వెన్స్ ఉంటుందని, ఈ ఎపిసోడ్లో చిరు దేవుళ్లతో సంభాషించే సీన్లు కూడా ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్ లో చిరుకి గతంలో యముడికి మొగుడు, జగదేకవీరుడు – అతిలోక సుందరి వంటి హిట్స్ ఉండటంతో సినిమాపై పోసిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. పైగా, ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ కి స్కోప్ ఉండటం, చిరంజీవి శివుడి క్యారెక్టర్లో గతంలో పలు సినిమాల్లో కనిపించి మెప్పించడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారనుందని చెప్పచ్చు.
వినిపిస్తున్న వార్తలు గనక నిజమే అయితే, రీఎంట్రీ తర్వాత తన మార్క్ ని పూర్తీ స్థాయిలో ప్రెజెంట్ చేయలేకపోతున్న చిరంజీవి అటు శివుడిగా, ఇటు అడ్వెంచరస్ క్యారెక్టర్లో కనిపించి అలరించే అవకాశం ఉంటుంది. భారీ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో 12మంది హీరోయిన్స్ తో పాటు భారీ తారాగణం కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి, సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ నిజమయ్యి తనకి కలిసొచ్చిన జానర్లో, టైలర్ మేడ్ లాంటి క్యారెక్టర్లో కనిపించి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News