Shankar: ఇండియన్2 కి అదే కొంప ముంచనుందా?

ఉలగ నాయగన్ కమల్ హాసన్ శంకర్ దర్శకత్వం లో ఇండియన్ 2 తెరకెక్కుస్తున్న సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన ఇండియన్ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే పలు అవాంతరాల తర్వాత ఆగిపోయిన సినిమా మళ్ళీ పట్టాలెక్కగా, తాజాగా ఇండియన్2 టీజర్ రిలీజ్ అయింది.

అయితే రిలీజ్ అయిన కొద్దీ సేపటికే ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ టీజర్ ఆడియన్స్ నుండి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇండియన్ 2 టీజర్ కాన్సెప్ట్ పరంగా ముందుగానే టీజర్ లో చెప్పినట్టు అనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, ఈ ఒక్క టీజర్ లోనే అందరి పాత్రల్ని రివీల్ చేయడం ఇండియన్2 కి ఒక రకంగా మైనస్ అయ్యిందని అంటున్నారు జనాలు.

ఎందుకంటే కమల్ హాసన్ ఎలాగో సేనాపతి రోల్ లోనే వస్తాడని తెలుసు, కానీ ఇతర యాక్టర్ల పాత్రల గురించి సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉండేదని కొందరి అభిప్రాయం. మరి కొందరైతే ఇంత మంది భారీ క్యాస్టింగ్ ని పెట్టుకున్నారు, కానీ అందరికి సరైన పాత్ర ఇచ్చారా లేదా అనే డౌట్ వస్తుంది. ఒక రకంగా ఇంతమంది నటులు సినిమాకి అవసరం లేదన్న వాదన కూడా ఉంది.

- Advertisement -

ఇక టీజర్ కట్స్ కూడా అంత ఆసక్తిగా ఉండకుండా, గందరగోళంగా ఉందని టాక్ వస్తుంది. మరి రిలీజ్ అయ్యే వరకు సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు