Prabhas: సలార్ ఉంటుందా… వాయిదా పడుతుందా?

Prabhas Salaar Update:

హోంబలే ఫిల్మ్స్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, సినీ ఇండస్ట్రీలో ఓ విప్లవాన్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఇదే కాంబినేషన్‌లో ఇప్పుడు సలార్ మూవీ వస్తోంది.

హై ఎక్సెపెక్టేషన్స్ ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. అంటే ఇంక 43 డేస్ మాత్రమే ఉంది. కానీ, ఇప్పటి వరకు హోంబలే ఫిల్మ్స్ ప్రమోషన్స్ పనులను స్టార్ట్ చేయలేదు. గతంలో కేేజీఎఫ్ టైంలో ప్రొడ్యూసర్లు ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు. కానీ, సలార్ విషయంలో అది కనిపించడం లేదు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను కనీసం రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేయాలి. కానీ, ఇప్పటి వరకు ప్రమోషన్స్ చడి చప్పుడు లేదు.

ఇంక సలార్ మూవీ రిలీజ్ కి 43 రోజులే మిగిలి ఉన్నా, ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంపై మూవీ రిలీజ్ పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకి మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. వీటికి ఆన్సర్ రావాలంటే, హోంబలే వాళ్ల నుంచి ఇప్పటికైనా ప్రమోషన్స్ వర్క్స్ స్టార్ట్ అవ్వాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు