Megastar: ఆ రెండు లేకుండా చిరంజీవి కొత్త సినిమా – ఫ్యాన్స్ కు షాక్ తప్పదా ?

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లని అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాతో హైట్రిక్ విజయం సాధించాలని తహతహలాడుతున్నాడు. ఈ సినిమా తమిళ సినిమా అయిన వేదాళంకి రీమేక్ గా తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తూండగా.. చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో డైరెక్టర్ గా మంచి బ్రేక్ అందుకున్న యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. ఈ సినిమాని జూలై నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. మలయాళ చిత్రం బ్రో డాడి చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధం చేశారని.. ఇది చిరంజీవికి విపరీతంగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ మూవీకి బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. ఈ మూవీ కథ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. ఇందులో ఒక్క ఫైట్ కానీ, విలన్ గాని లేరని.. చిరులోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో వాడుకునేందుకు దర్శకుడు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి ఈ రెండు లేకుండా చిరంజీవి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు