Rashmika Mandanna: అవును వాళ్లిద్దరూ విడిపోలేదు..!

రష్మిక మందన్న, ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కెరీర్ మొదలు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన ఆఫర్లు సాధించి జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న రష్మిక, అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వటంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కన్నడ భామ అతనితో రిలేషన్లో ఉందన్న రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ కి బలం చేకూరే విధంగా పలు సందర్భాల్లో ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళటం, ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.

అయితే, విజయ్ మరో స్టార్ హీరోయిన్ తో చనువుగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలొచ్చాయి ఆ మధ్య. తాజాగా, ఆ వార్తల్లో నిజం లేదని రుజువు చేస్తూ మరో సంఘటన జరిగింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కలర్ ఫోటో నిర్మాత సాయిరాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ ఇటీవల రష్మిక చేతుల మీదుగా విడుదలైంది. సాధారణంగా, తన సినిమా ప్రమోషన్స్ లో మినహా బయట సినిమా ఈవెంట్స్ లో కనిపించని రష్మిక బేబీ సినిమా ఈవెంట్ కి హాజరవడం చర్చకు దారి తీసింది.

రష్మిక ‘బేబీ’ ఈవెంట్ కి రావటానికి కారణం విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ రిక్వెస్ట్ చేయటం వల్లనే రష్మిక ‘బేబీ’ సినిమా ఈవెంట్ కి వచ్చిందని అంటున్నారు. దీంతో వాళ్లిద్దరూ విడిపోయారు అన్న వార్తల్లో నిజం లేదని తేలింది. ఏదేమైనా రష్మిక హాజరవటం ‘బేబీ’ సినిమాకి కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా జులై 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అందుకోని ఆనంద్ దేవరకొండకి ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు