Yo Yo Honey Singh : భార్యతో విడాకులు, ప్రేయసితో బ్రేకప్… అంతలోనే మరో హీరోయిన్ పై హనీ సింగ్ కన్ను

Yo Yo Honey Singh : బాలీవుడ్ పాపులర్ రాప్ సింగర్స్ లో యోయో హనీ సింగ్ కూడా ఒకరు. ఈయన రూపొందించిన లుంగీ డాన్స్, పార్టీ ఆల్ నైట్, సన్నీ సన్నీ వంటి పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దెబ్బకి ఈ రాపర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. భాష తెలియని వారు కూడా హనీ సింగ్ పాటలను విని ఎంజాయ్ చేసేంత బెస్ట్ మ్యూజికల్ హిట్స్ ను అందించి పాపులర్ అయ్యాడాయన. కానీ హనీ సింగ్ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాల్లోనే నిలుస్తుంది. భార్యకు విడాకులు ఇచ్చాడు, ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. అంతలోనే మరో హీరోయిన్ పై ఈ రాపర్ కన్ను పడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హనీ సింగ్ ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్త తెరపైకి వచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకుముందు ఈ స్టార్ సింగర్ కెరీర్ లో నెలకొన్న వివాదాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హీరా సోహెల్ తో హనీ సింగ్ డేటింగ్…

నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం హనీ సింగ్ ప్రస్తుతం హీరా సోహెల్ తో డేటింగ్ లో ఉన్నారు. నిజానికి ఏడాది కాలంగా వీరిద్దరూ లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా రూమర్లు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ జంట రొమాంటిక్ హాలిడేస్ కి కూడా వెళ్లారు. అయితే ఈ ఏడాది మార్చ్ లో ముంబైలో జరిగిన హోలీ ఈవెంట్లో హనీ సింగ్,  హీరా కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు తెరపైకి వచ్చాయి. మరి ఈ జంట తమ రిలేషన్ ను ఎప్పుడు బయట పెడతారో చూడాలి.

Honey Singh Finds Love Again? Singer Dating THIS Actress After Breakup With Tina Thadani | Times Now

- Advertisement -

హీరా సోహెల్ ఎవరు?

హీరా సోహల్ అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలలో నటించిన నటి. 2022లో ఆమె అజయ్ దేవగన్ , సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన థాంక్ గాడ్ చిత్రంలో కూడా నటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 500k కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీ ఫాలోయింగ్.

హనీ సింగ్ కు ముచ్చటగా మూడో రిలేషన్షిప్

హీరా కంటే ముందు హనీ సింగ్ టీనా తడానీతో డేటింగ్ చేశాడు. కానీ వారిద్దరూ 2023లో తమ సంబంధాన్ని బ్రేక్ చేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు ఒకరితో ఒకరు ఉన్న ఫోటోలను కూడా తొలగించారు. గతంలో గాయని షాలిని తల్వార్‌ను పెళ్లి చేసుకుని, ఆమెతో 11 ఏళ్లు వైవాహిక జీవితాన్ని గడిపాడు. 2022లో ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు హీరాతో ముచ్చటగా మూడోసారి రిలేషన్ లో ఉన్నాడు హనీసింగ్. కాగా హనీ సింగ్ వర్క్ విషయానికొస్తే ప్రస్తుతం తన తాజా ఆల్బమ్ ది గ్లోరీతో వార్తల్లో ఉన్నాడు. అలాగే అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన కూడా ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు