Megastar: చిరుని టార్గెట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్లు..!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చిరంజీవి నుండి ఆయన అభిమానులు ఆశించే స్థాయిలో సినిమా రాకపోవటంతో ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ద్వారా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తరవాత ఆలోచన తీరు మార్చుకున్న చిరంజీవి యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వటం మొదలు పెట్టాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి గ్యాప్ దొరికితే యువ దర్శకులు నుండి వస్తున్న కథలు వింటూ వాటికి మార్పులు చేర్పులు సూచిస్తూ బిజీగా గడుపుతున్నారు.

చిరంజీవి రూట్ మార్చిన విషయాన్నీ గమనించిన యంగ్ డైరెక్టర్స్ ఆయన కోసం కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ, యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చిన మెగాస్టార్ ఇకపై యువ దర్శకులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. వరుసగా కథలు వింటున్నప్పటికీ, దేనిని ఫైనలైజ్ చేశారు అన్న క్లారిటీ మెగా కాంపౌండ్ నుండి రావట్లేదు. భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ బట్టి ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయాలి అన్నది డిసైడ్ అయ్యే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వటం వెనక మరో కారణం ఉందని టాక్ వినిపిస్తోంది. సీనియర్ డైరెక్టర్స్ కి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, దాని ప్రభావం సినిమా బడ్జెట్ పై,తన రెమ్యునరేషన్ పై పడుతుందని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే యంగ్ డైరెక్టర్స్ అయితే తన రెమ్యునరేషన్ తగ్గించుకునే అవసరం ఉండదని ఈ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు మేకర్స్. తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు