VS11: మెల్లగా నందమూరి కాంపౌండ్ కి షిఫ్ట్ అవుతున్న యువ హీరో..!

ధమ్కీ సినిమాతో  రీసెంట్ గా హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలను లైన్లో పెట్టి స్పీడ్ పెంచాడు. స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన అయిన విశ్వక్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తారక్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఇటీవల సింహాద్రి సినిమా రీరిలీజ్ కి ఏర్పాటు చేసిన  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై ఎన్టీఆర్ పాటకి స్టేజ్ మీద డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా హాజరై నందమూరి కుటుంబం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్బంగా VS11 సినిమా యూనిట్ నుండి నివాళి అర్పిస్తూ పోస్ట్ విడుదల అయ్యింది. ‘జోహార్ ఎన్టీఆర్, తెలుగోడి ఆత్మ గౌవరవం’ అంటూ క్యాప్షన్ తో ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విశ్వక్ సేన్ ఫోటోతో పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ నందమూరి కాంపౌండ్ కి షిఫ్ట్ అయ్యాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమా యూనిట్ల నుండి ఇలాంటి పోస్ట్ లేని క్రమంలో విశ్వక్ సేన్ సినిమా యూనిట్ నుండి ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పోస్ట్ రావటంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. నిజానికి విశ్వక్ ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నాడని, తరచూ ప్రైవేట్ పార్టీస్ కి కూడా వెళుతున్నాడని టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ పోస్ట్ ఆ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

నిజానికి మల్టీ ట్యాలెంటెడ్ హీరో అయిన విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి విశ్వక్ తన వ్యక్తిగత అభిమానాన్ని ఇలా సినిమాల్లో కనబరుస్తూ ఉండటం వల్ల ఒక వర్గం అభిమానులకే పరిమితం అయ్యే ప్రమాదం లేకపోలేదు. వ్యక్తిగతంగా అభిమానం ప్రదర్శించటాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, ఇలా సగటు హీరో అభిమాని స్థాయికి దిగజారి వ్యక్తిపూజ చేయటం సినిమా హీరో లక్షణం అనిపించుకోదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు