Youtuber Praneeth Hanumantu : ప్రణీత్‌కు జైలులో మెడికల్ టెస్ట్… మరో కేసు బుక్… బయటపడటం కష్టమే

Youtuber Praneeth Hanumantu : అతని తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అతను సోదరుడు ఒక మోడల్. తను కూడా ఇంట్లో వాళ్లపై ఆధారపడకుండా ఏదో సాధిద్దాం అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ముందుగా అందరిలానే షార్ట్ ఫిలిం చేయడం మొదలుపెట్టాడు. అయితే షార్ట్ ఫిలిమ్స్ అంతగా క్లిక్ కాలేదు. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ ఉండటం వలన ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, సినిమాల మీద కొద్దో గొప్ప అవగాహన ఉండడంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్ లో అందరిలా కాకుండా సినిమాలను ట్రోల్ చేయటం సినిమాలో నటించిన వారిని ట్రోల్ చేయటం పర్సనల్ అటాకింగ్ వంటివి చేయడం మొదలుపెట్టాడు.

ఇక సమాజంలో ఎప్పటినుంచో వస్తున్న నానుడి ఒకటి ఉంది. మంచి కంటే చెడు త్వరగా పాపులర్ అవుతుంది అని. ఒక సినిమాను అప్రిషియేట్ చేసినప్పుడు పెద్దగా రీచ్ ఉండకపోవచ్చు. కానీ అదే సినిమాను, ఆ సినిమాలోని నటులను ట్రోల్ చేస్తే అద్భుతమైన రీచ్ ఉంటుంది. ప్రణీత్ హనుమంతు విషయంలో ఇదే జరిగింది. కేవలం సినిమాలను మాత్రమే కాకుండా చాలా షార్ట్ ఫిలిమ్స్ ని కూడా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశాడు హనుమంతు. ఈ ప్రాసెస్ లో చాలామంది ప్రణీత్ కి ఫాలోవర్స్ వచ్చారు. అయితే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రణీత్ ఆ లిమిట్ ను చాలా సార్లు దాటి పర్సనల్ కామెంట్స్ చేశాడు.

Praneeth Hanumanthu

- Advertisement -

కేవలం షార్ట్ ఫిలిమ్స్ ని, సినిమాలనీ ట్రోల్ చేయటం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రీల్స్ కూడా ట్రోల్ చేశాడు. ఈ ప్రాసెస్ లో ఒక తండ్రి కూతురు మధ్య జరిగే ఒక క్యూట్ వీడియోని వేరే కోణంలో మాట్లాడుతూ అబ్యూజ్ కామెంట్స్ చేశాడు. ఇక్కడితో ప్రణీత్ హనుమంతు చేసిన ఈ వీడియో హీరో సాయిధరమ్ తేజ్ చేసిన ఒక ట్వీట్ వలన బయటకు వచ్చింది. సాయి తేజ్ చేసిన ఈ ట్వీట్ కి చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు స్పందించడం వలన, ప్రణీత్ పైన చట్టం కఠిన చర్యలు తీసుకుంది.

అయితే ఇప్పుడు కొత్తగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ కి జైలులో మెడికల్ టెస్ట్ చేశారట. ఈ టెస్టులో ప్రణీత్ గంజాయి తీసుకున్నట్లు వెలువడినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా అఫీషియల్ గా న్యూస్ బయటకు రాలేదు. ఒకవేళ ఇదే నిజమైనట్లయితే ప్రణీత్ ఇప్పట్లో బయటకు రావడం కష్టం. ఏదేమైనా సోషల్ మీడియా వేదిక మాట్లాడే ముందు కొంచెం నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది అంటూ సోషల్ మీడియాలోని కొంతమంది కామెంట్స్ వినిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు