Anjali : డూప్ లేకుండా ఆ సీన్స్ చేశా… నెగెటివ్ కామెంట్స్ ని పట్టించుకోను..

Anjali : తెలుగు హీరోయిన్ అంజలి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది.. మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అంజలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.. ఆ సందర్బంగా ఆమె తన పై రూమర్స్ కు చెక్ పెట్టింది.. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

హీరోయిన్ అంజలి తన వెబ్ సిరీస్ బహిష్కరణ సక్సెస్ తర్వాత ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. అందులో మాట్లాడుతూ తన కేరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. అందులోని ఇంటిమేట్ సీన్స్ పై కూడా ఆమె స్పందించారు.. తన కేరీర్ ప్రారంభం నుంచి నాకు మంచి పాత్రలు వచ్చాయి. కంటెంట్ బాగుండి పాత్రకు పాధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకున్నాను. కొన్ని సినిమాల కోసం భారీ యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా నేర్చుకున్నాను.. డూప్ లేకుండా కొన్ని సీన్స్ చేశాను.. కొన్ని సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను అని అంజలి చెప్పింది.

Anjali's shocking comments on Baishkarana web series scenes
Anjali’s shocking comments on Baishkarana web series scenes

ఇక అంజలి రీసెంట్ వెబ్ సిరీస్ బహిష్కరణ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది.. ఆ సిరీస్ లోని సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు రూమ్ లో ఎవరు లేకుండా మరి షూటింగ్ చేసినట్లు చెప్పింది.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నేను ఎంతవరకు న్యాయం చేసానో చూసాను.. కానీ అందరు నన్ను తప్పు పట్టారు.. నన్ను దారుణంగా ట్రోల్స్ చేశారు.. అయితే పాత్రను మాత్రమే నేను మైండ్ లో పెట్టుకున్నా అందుకే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను అస్సలు పట్టించుకోనని అంజలి చెప్పేసింది.. నా పెళ్లి పై గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి… సమయం వచ్చినప్పుడే బయట పెడతానని ఆమె చెప్పింది.. ప్రస్తుతం సినిమాలను లైన్లో పెడుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు