Anshu Ambani : నా జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనే.. ఎన్నో కష్టాలను అనుభవించాను..

Anshu Ambani : ఒకప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు ఫెడ్ ఔట్ అయ్యారు.. అందులో చాలా మంది సెకండ్స్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నారు.. కొందరు ఒకటి రెండు సినిమాల తర్వాత హీరోలతో వస్తున్న ఏఫైర్స్ వల్ల సినిమాలకే గుడ్ బై చెప్పేస్తున్నారు.. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు అన్షు అంబానీ.. ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేసినట్లు కనిపించలేదు.. అందుకు కారణం ఆ రూమర్స్ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.. అంతేకాదు తన జీవితంలో అనుభవించిన కష్టాల గురించి ఆ ఇంటర్వ్యూ లో బయట పెట్టింది..

అన్షు అంబానీ అందానికి అప్పట్లో స్టార్ హీరోలు ఫిదా అయ్యారు.. ఆమెను తమ సినిమాలో నటించాలని డైరెక్ట్ గా కోరేవారు.. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల సినిమాల కు దూరం అయ్యింది.. ఈమె అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు’ మూవీలో హీరోయిన్.. ఆ సినిమాలో అన్షు పాత్ర కొద్దిసేపే ఉంటుంది.. తన అమాయకత్వం, అందంతో ఆకట్టుకుంది.. నెక్స్ట్ ప్రభాస్ ‘రాఘవేంద్ర’ సినిమాతో పాటు ఓ తమిళ సినిమా అవకాశం అందుకున్నారు. కానీ బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని.. మూడు సినిమాలతోనే యాక్టింగ్ కెరీర్ కి ఎండ్ కార్డు వేసేసారు..

Anshu Ambani away from the film industry because of him?
Anshu Ambani away from the film industry because of him?

అంత అందమైన హీరోయిన్ ఎందుకు సినిమాలను మానేసింది అనేది ఆడియన్స్ లో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తి దూరమైన అన్షు.. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొంది.. ఈ అమ్మడు సినిమాల నుంచి తప్పుకోవడానికి అతనే కారణం అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.. సినిమాలోకి వచ్చినప్పుడు ఆమెది చాలా యంగ్ ఏజ్ కావడం, అంతేకాకుండా ఆమె తండ్రి ఓవర్ ప్రొటెక్టీవ్ కావడంతో.. సినిమాల్లో తాను ఏం చెయ్యాలి, ఇండస్ట్రీలో తాను ఎవరితో మాట్లాడాలి అనేవి ఆమె తండ్రే నిర్ణయించేవారట.. అందుకు కారణం మన్మధుడు టైం లో నాగార్జునతో రూమర్స్ అట.. ఇప్పుడు సినిమాల్లోకి వస్తే ప్రభాస్ తో బాహుబలి లాంటి సినిమా చేస్తానని చెప్పింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు