Bobby Simha : ‘మా సినిమా కేవలం తెలివి తక్కువ వాళ్లకే’… ఏం బాబీ సింహా ఇలాంటి స్టెట్‌మెంట్ ఇచ్చావు

Bobby Simha : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో బాబి సింహ ఒకరు. ముందుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి ఆ తర్వాత తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు బాబి సింహ. బాబీ కార్తీక్ సుబ్బరాజ్ కి ఫ్రెండ్ కావడంతో కార్తీక్ చేసే ప్రతి సినిమాలోని మంచి క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. ఇకపోతే తెలుగు ప్రేక్షకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గొప్ప సినిమాలు గొప్ప నటులు ఏ భాషలో ఉన్నా కూడా వాళ్ల గురించి తెలుసుకొని వాళ్ళ సినిమాలు వెతుక్కుని మరీ చూస్తారు.

ఇకపోతే తెలుగులో కూడా బాబీ సింహ కొన్ని సినిమాల్లో నటించారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కో రాజా సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు బాబి సింహ. ఆ తర్వాత తమిళ్లో బాబీ సింహ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవడం వలన తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. రీసెంట్ గా వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కూడా బాబీసింహ కీలక పాత్రలలో కనిపిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించాడు.

Bobby Simha

- Advertisement -

శంకర్ దర్శకత్వంలో ఇదివరకే వచ్చిన ఇండియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కించాడు శంకర్. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. దీని గురించి కొంతమంది కొన్ని రకాలుగా కామెంట్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా బాబీ సింహ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీటి పైన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా మేము తెలివైన వాళ్ళ కోసం తీయలేదని, అంతగా సినిమా పైన, టెక్నికల్ విషయం పైన అవగాహన లేని కోసం లేని వాళ్ళ కోసమే ఈ సినిమాను తీశామని, ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు