Heroine : ప్రభాస్ మై డార్లింగ్.. కొంపదీసి ప్రేమిస్తుందా ఏంటి?

Heroine : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి’.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.. వంద కోట్లు మొదటి రోజే దాటేసింది.. ప్రస్తుతం 1000 కోట్ల గ్రాస్ ను రాబట్టే దిశగా దూసుకుపోతుంది.. బాహుబలి 2 తర్వాత మళ్లీ ప్రభాస్ చిత్రానికి ఆ రేంజ్ టాక్, కలెక్షన్లు కల్కికే వస్తున్నాయి. ఇక తాజాగా ప్రభాస్ గురించి హంస నందిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ చేసిన ‘మిర్చి’చిత్రంలో హంస స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల ఇంటర్వ్యూ లో తెలిపింది.. అంతేకాదు ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది..

ప్రభాస్ సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో.. తనతో పనిచేసిన వారిని బాగా చూసుకోవడంతో పాటుగా సినిమా అయ్యాక కూడా గుర్తు పెట్టుకొని సాయం చేస్తాడు.. అందుకే రెబల్ స్టార్ మనసు వెన్న అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటారు.. తాజాగా మిర్చీ ఐటమ్ గర్ల్ హంసా నందిని ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సమయంలో ప్రభాస్ చేసిన ఓ పని గురించి హంస చెప్పుకొచ్చింది… మిర్చీ సినిమా పూర్తి అయ్యాక తన ఒక టికెట్ ఇచ్చి తన సాంగ్ ఎప్పుడొస్తుందో అనే విషయాన్ని కూడా చెప్పాడని ప్రభాస్ చాలా స్వీట్” అంటూ హంస నందిని చెప్పింది. ఆ సినిమా తర్వాత ఇప్పటికి తాను కాంటాక్ట్ లో ఉన్నట్లు నోరు జారేసింది..

hamsanandini intresting comments on prabhas
hamsanandini intresting comments on prabhas

ప్రభాస్ కల్కి సూపర్ హిట్ ను అందుకోవడం ఆనందంగా ఉందంటూ హంసా నందిని చెప్పేసింది.. మళ్ళీ సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పింది.. ఈ విషయం విన్న కొందరు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే ఈమె ఇంట్రెస్ట్ చూస్తుంటే హంసా కొంపదీసి ప్రభాస్ ను ప్రేమిస్తుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక ఇటీవలే క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయటపడింది.. ప్రస్తుతం సినిమాలు ఇప్పటివరకు అయితే అనౌన్స్ చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఓవర్ డోస్ ను పెంచేస్తూ ఘాటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు