Harish Sankar : ‘Mr. Bachchan’..ఈ టైటిల్ నాది కాదు.. బాంబ్ పేల్చిన డైరెక్టర్..

Harish Sankar : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు.. ఆయన సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయో అందరికీ తెలిసిందే.. కేవలం సినిమా కథలే కాదు.. ఆయన పెట్టే టైటిల్స్ మాస్ ఆడియన్స్ కు ఎంతగా కనెక్ట్ అవుతాయో తెలిసిందే.. తాజాగా ఈయన ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూ లో ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టాడు.. మిస్టర్ బచ్చన్ టైటిల్ విషయంలో ఆ హీరోనే ఫైనల్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు.. ఇంకా ఎన్నో విషయాల గురించి చెప్పి ఆయన బాంబ్ పేల్చాడు..

హరీష్ శంకర్ తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యాడు.. అక్కడ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అయితే సినిమాల టైటిల్స్ విషయంలో హీరోలు చెప్పిందే తాను వింటానని చెప్పాడు. గబ్బర్ సింగ్ సినిమాకు మొదట వేరే పేరు అనుకున్నారట.. కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు గబ్బర్ సింగ్ అని చెప్పడంతో అది బాగుందని ఓకే చేసాడట.. అలా రవితేజ కాంబోలో వచ్చిన మిరపకాయ్ సినిమాకు మొదట రొమాంటిక్ రిషి అని అనుకున్నారట.. రవి తేజ మార్చమంటే మిరపకాయ్ అనే టైటిల్ ను ఖాయం చేసినట్లు ఆయన అనడం గమనార్హం.. అలాగే ఇప్పుడు వస్తున్న మిస్టర్ బచ్చన్ టైటిల్ ను కూడా ఆయన ఫైనల్ చెయ్యలేదని అన్నాడు..

Harish Shankar sensational comments on Mr. Bachchan's title..
Harish Shankar sensational comments on Mr. Bachchan’s title..

ఈ సినిమాకు ముందుగా నామ్ తో సునయా అని అనుకున్నారట.. అది జనాలకు రీచ్ అవ్వడం కష్టమని రవితేజ అన్నాడట.. అంతేకాదు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ‘ Mr. Bachchan ‘ సరిపోతుంది కదా అని చెప్పడంతో ఇది బాగుందని మిస్టర్ బచ్చన్ టైటిల్ ను ఫైనల్ చేసినట్లు హరీష్ అన్నారు.. ఇప్పటివరకు ఈయన తెరకేక్కించిన సినిమాలకు టైటిల్స్ హీరోలే పెట్టినట్లు చెప్పాడు.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇకపోతే హరీష్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఆగష్టు 15 న సినిమా విడుదల కాబోతుంది.. మరి ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు