Hero Nani: జస్టిస్ హేమా కమిటీ పై నాని షాకింగ్ కామెంట్స్.. విషాదకరం అంటూ..?

Hero Nani.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో నాని (Nani )ఎంతోమందికి ఆదర్శం అని చెప్పవచ్చు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు అంటే , ఆయన స్వయంకృషి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తన సినిమాలలో నటించే ప్రతి హీరోయిన్ తో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న నాని అంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీలలో మంచి గౌరవం కూడా ఉంది.

Hero Nani: Nani's shocking comments on Justice Hema's committee.. Tragic..?
Hero Nani: Nani’s shocking comments on Justice Hema’s committee.. Tragic..?

జస్టిస్ హేమా కమిటీపై నాని ఆవేదన..

ఇదిలా ఉండగా తాజాగా నాని తన హృదయం ముక్కలైంది అంటూ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే మలయాళ ఇండస్ట్రీలో మహిళా అన్నట్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాజాగా 233 పేజీలు కలిగిన ఒక నివేదికను జస్టిస్ హేమ కమిటీ సమర్పించగా. ఆ కమిటీలో పలు అంశాలు ప్రధమంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. చాలామంది ఆడవాళ్లు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవకాశాలు కావాలి అంటే హీరో దర్శకనిర్మాతల కోరికలు తీర్చాలి. ఇది ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీలో జరుగుతోంది అంటూ జస్టిస్ హేమ తన నివేదికలో వెల్లడించింది.

నా గుండె ముక్కలైంది..

అయితే ఈ నివేదికపై తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు నాని. మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలిసి నా గుండె ముక్కలైంది. నా సినిమా సెట్స్ లో ఇలాంటివి ఎప్పుడూ నేను చూడలేదు. మెయిన్ స్ట్రీమ్ సినిమా షూట్స్ లో ఇలాంటివి జరగవు అని అనుకుంటున్నాను. ఈ నివేదిక చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. సినిమాల్లో సక్సెస్ అవ్వాలని వస్తున్న మహిళలకు ఇక్కడ అనువైన పరిస్థితులు కల్పించాలి అని ఆశిస్తున్నాను అంటూ అభిప్రాయపడ్డారు నాని.

- Advertisement -

నాని సరిపోదా శనివారం..

నాని సినిమాల విషయానికి వస్తే. సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నారు నాని. ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా రాణిస్తున్న ఈయన.. చివరిగా దసరా , హాయ్ నాన్న చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుని, ఇటీవల హాయ్ నాన్న చిత్రానికి ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు నాని. ఇక ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్న తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై కూడా స్పందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.

సరిపోదా శనివారం సినిమా విశేషాలు..

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 29న తెలుగు, హిందీ , మలయాళం , తమిళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు