IMDB Top Rating : టాప్ 5 సెలబ్రిటీస్ వీళ్లే.. ఒక్కొక్కరివి ఎన్ని చిత్రాలంటే..?

IMDB Top Rating.. సాధారణంగా తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని సెలబ్రిటీల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టడం సహజం.. అయితే ఇప్పుడు దీనికి కారణం కొన్ని సర్వేలనే చెప్పాలి ఉదాహరణకు ఓర్మ్యాక్స్ , ఐ ఎమ్ డి బి లాంటి సర్వే సంస్థలు టాప్ ప్లేస్ లో సినిమాలను అలాగే హీరోలను లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఓర్మాక్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఏ సెలబ్రిటీ ని ఎక్కువ పాపులర్ చేశారు అనే విషయంపై జాబితా ప్రిపేర్ చేస్తే, ఐఎండిబి ఏ సినిమా ప్రేక్షకులను ఎంతలా మెప్పించింది అనే జాబితాను తయారు చేస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోని ఐఎండిబి తాజాగా విడుదల చేసిన లిస్టులో టాప్ 5సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా ఐఎండిబి టాప్ రేటింగ్ 8.0 మించి రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాను, ఆ సినిమాలు తీసిన హీరోలను విడుదల చేయడం జరిగింది. మరి ఏ హీరో సినిమాలు, ఎన్ని సినిమాలు ఈ రేటింగ్ అందుకున్నాయో ఇప్పుడు చూద్దాం.

IMDB Top Rating : These are the top 5 celebrities.. how many films each of them..?
IMDB Top Rating : These are the top 5 celebrities.. how many films each of them..?

మహేష్ బాబు:

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు.. తన సినిమాలతో టాలీవుడ్ కు మాత్రమే పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్ ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు.. అందులో భాగంగానే ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన 29వ చిత్రాన్ని ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించే పనిలోపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం ఫిజిక్ ను మైంటైన్ చేయడానికి తెగ వర్కౌట్స్ చేస్తూ కష్టపడిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోవడమే కాదు సినిమా కథల ఎంపిక విషయంలో కూడా టాప్ గా నిలిచారు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఈయన నటించిన 4 సినిమాలు ఏకంగా ఐఎండిబి జాబితాలో 8.0 కంటే ఎక్కువ రేటింగ్ సాధించి మహేష్ బాబును నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.

- Advertisement -

ప్రభాస్:

పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి చిత్రాన్ని తెరకేక్కించి అతి తక్కువ సమయంలోనే రూ 1000 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఈ సినిమా తరువాత మరో ఐదారు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఐఎండిబి విడుదల చేసిన జాబితా ప్రకారం 8.0 కంటే ఎక్కువ రేటింగ్స్ సాధించాయి.

పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సినిమాలలో కూడా తాను కమిట్ అయిన చిత్రాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈయన నటించి విడుదల చేసిన రెండు చిత్రాలు ఐఎండిబి లో 8.0 రేటింగ్ సాధించాయి.

నాచురల్ స్టార్ నాని..

నాచురల్ స్టార్ నాని ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరొకవైపు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టారు .
ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల ప్రకటిస్తున్న ఈయన 2 చిత్రాలు ఐఎండిబి 8.0 రేటింగ్ సాధించాయి.

విజయ్ దేవరకొండ..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు ఈమధ్య కాలంలో పెద్దగా ఆయనకు కలిసి రావడం లేదనే చెప్పాలి. లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు పరవాలేదు అనిపించుకున్నాయి కానీ ఈయన నటించిన రెండు చిత్రాలు కూడా ఐఎండిబి 8.0 రేటింగ్ సాధించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు