Keerthy Suresh : ఇన్నాళ్లు దాచింది బయటపడంది… మొత్తానికి బాయ్ ఫ్రెండ్‌ను రివీల్ చేసేసింది..

Keerthy Suresh : కీర్తి సురేష్.. ఈ పేరుకు తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లో కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. తెలుగులో చేసిన సినిమా కీర్తి సురేష్ కు ఎంతగా పేరును తీసుకొచ్చాయో అందరికీ తెలుసు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో ఆమె నటించింది. ఈ మధ్య కీర్తి సురేష్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక ఇటీవల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అక్కడ కూడా తన హవాను కొనసాగిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. సౌత్ సినీ లవర్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు నార్త్ ఆడియన్స్ గుండెల్లో చోటు సంపాదించుకుంటుంది.. కాగా తాజాగా కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.. కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ సినిమాల గురించి ఎదురైన అన్ని విషయాల గురించి చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి పై వస్తున్న వార్తల పై ప్రశ్న ఎదురైంది. మీరు సింగిల్ కదా అని అడగ్గా.. నేను సింగిల్ అని మీకు ఎవరు చెప్పారు. నేను సింగిల్ కాదు అని సమాధానం చెప్పింది. అయితే ఈమె కూడా ఆల్రెడీ బుక్ అయ్యిందా అనే కామెంట్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.. అంటే ఆమె మొత్తానికి బిజీ గా ఉందని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

Keerthy Suresh revealed about boyfriend
Keerthy Suresh revealed about boyfriend

ఒకప్పుడు మలయాళ హీరోయిన్ మేనక కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అందం అభినయానికి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. అలా ఈమె అందానికి ఫిదా అయినా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీలో నటించి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది.

- Advertisement -

అక్కడ మీరు ఇంకా ఎందుకు సింగిల్ గా ఉంటున్నారు బోర్ కొట్టడం లేదా అని ఓ జర్నలిస్ట్ అడగగా.. నేను సింగిల్ అని మీకు ఎవరు చెప్పారు.. అయినా పెళ్లి అనేది రెండు మనసులు కలవాలి. అలాగే ఇద్దరు మనుషుల మధ్య పరస్పర అవగాహన కూడా ఉండాలి. అలా అయితేనే పెళ్లి బంధానికి వ్యాల్యూ ఉంటుంది..అంటూ కీర్తి సమాధానం చెప్పింది. దీంతో కొత్త అనుమానాలు మొదలైయ్యాయి. అయితే ఈమె సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేస్తుందా? ఇంతకీ అతను ఎవరు? సినిమా వాడేనా? లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి. మరి ఈ అమ్మడు అతన్ని ఎప్పుడు చూపిస్తుందో చూడాలి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు