Darling 2024 : డార్లింగ్ కోసం కేవీ అనుదీప్, మరో ఫన్ ఇంటర్వ్యూ లోడింగ్

Darling: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది డైరెక్టర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సాధిస్తారు. ఇలా ఉదాహరణకు చెప్పుకుంటే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మంచి పాపులర్ అయ్యాడు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ సినిమా కోసం చాలామంది ఆడియన్స్ ఎదురుచూసేవారు. లేకపోతే సినిమా రిలీజ్ కంటే ముందే క్యాష్ అనే ఒక ప్రోగ్రాం తో బాగా గుర్తింపు సాధించాడు అనుదీప్.

ఇక అనుదీప్ దర్శకత్వం వహించిన జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వల్గారిటీ లేని ఒక ప్యూర్ కామెడీని అద్భుతంగా చూపించి ప్రేక్షకులతో నవ్వులు పువ్వులు పూజించాడు. ప్రియదర్శి, రాహుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక్కడితో అనుదీప్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా ప్రిన్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది.

Anudeep KV

- Advertisement -

వాస్తవంగా అనుదీప్ సినిమాలు కంటే కూడా అనుదీప్ ఇంటర్వ్యూ బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. అనుదీప్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న కచ్చితంగా నవ్వు తెప్పిస్తాడు. కూల్ గా మాట్లాడుతూ మంచి ఫన్ జనరేట్ చేస్తాడు. ఇకపోతే సినిమాను ప్రమోట్ చేయడంలో మంచి స్ట్రాటజీ యూస్ చేస్తాడు అని చెప్పొచ్చు. ఇక అదే విధంగా ప్రియదర్శి, నబా నటేష్ నటించిన డార్లింగ్ సినిమాను ఇప్పుడు అనుదీప్ ప్రమోట్ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఈరోజు విడుదల కానుంది. ఇదివరకే రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు