Mrunal Thakur: కెరీర్ పై కామెంట్స్ చేసిన సీతామహాలక్ష్మి.. అది నా చిన్ననాటి కళ అంటూ..!

Mrunal Thakur: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించి భారీ హిట్ అందుకుంది. అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఇది ఇలా ఉండగా…. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన కెరీర్ గురించి సంచలన వాక్యాలు చేసింది.

Mrunal Thakur: Seetha to be seen opposite Raghava Lawrence?

- Advertisement -

“తన చిన్నతనం నుంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని, ఒక మంచి నటిగా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా ఎప్పుడూ సినిమాల మీద నాకు కోరిక లేదు. కానీ సమయం, విధి నన్ను ఈ వైపునకు నడిపించాయి. ఈ క్రమంలోనే బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీ చేశాను. నాకున్న అభిరుచిని తెలుసుకున్నాను”

“సినిమాల్లో ప్రయత్నాల కోసం ఆడిషన్స్ సమయంలో నాకు నటన మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ సమయంలో నన్ను నా స్నేహితులు బాగా ప్రోత్సహించేవారు. ఇక నేను నటించిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో నా టాలెంట్ చూపించాను” అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వాక్యాలు వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు