Jr NTR : మందు తాగకుండానే కిక్‌లో ఉంటా… ఆల్కహాల్ ఆడిక్ట్‌పై తారక్ ఆన్సర్ ఇదే..

Jr NTR : నందమూరి వంశంలో ప్రస్తుతం బాలయ్య కంటే ఎక్కువ పేరు వచ్చింది అంటే.. ఎలాంటి డౌట్స్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్తారు. అయితే కొన్ని రోజుల క్రితం తారక్ పై చాలా రూమర్స్ వచ్చాయి. తారక్ ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యారని కొంత మంది నెట్టింట్లో పెద్ద ఎత్తునా ప్రచారం చేశారు. అలాగే గతంలో తారక్ కు రోడ్డు ప్రమాదం కూడా ఆల్కహాల్ సేవించడం వల్లే జరిగింది అని కూడా ప్రచారం చేశారు. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ గానీ, అతని సన్నిహుతులు గానీ ఎప్పటికప్పుడు ఖండించారు. అయితే ఓ సందర్భంలో తారక్ తనపై వస్తున్న.. వచ్చిన ఆల్కహాల్ ఆడిక్ట్ రూమర్స్ పైన స్పందించాడు.

ఈ ఇంటర్వ్యూ కు ముందు ఎన్టీఆర్ మందు తాగినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో పై ఎన్టీఆర్ స్పందించారు. దాని గురించి ఇంటర్వ్యూ లో చెప్పాడు. నేను తాగినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆల్కహాల్ అడిక్ట్ అయితే కాను కానీ ఎప్పుడు కిక్ లోనే ఉంటాను అని, ఫ్రెండ్స్ తో సరదాగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ చిల్ అవుతానని క్లారిటీ ఇచ్చాడు. అప్పటిలో ఆ వీడియో ఓ రేంజులో ట్రెండ్ అయ్యింది. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు మద్యం తాగే అలవాటు లేదని చెప్పడంతో పాటుగా తాను తాగకుండానే కిక్ లో ఉంటానని చెప్పాడు. ఆ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ లైకులు, షేర్లతో ట్రెండ్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ కు ఉన్న మంచి హ్యాబిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఎప్పుడైన మా హీరో గ్రేట్ అంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాత ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

NTR gave clarity saying that I am not an alcohol addict
NTR gave clarity saying that I am not an alcohol addict

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క.. త్రిపుల్ ఆర్ సినిమా తో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బాలీవుడ్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ అనే సినిమాలో నటించనున్నాడు. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు