Aditi Rao Hydari Diet : అదితి డైట్ సీక్రెట్ రివీల్… అందుకేనా ఇంతందంగా ఉంది?

Aditi Rao Hydari Diet : హీరోయిన్లు అందంగా, ఫిట్ గా ఉండడానికి స్పెషల్ డైట్ ను ఫాలో అవుతారన్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డైట్ సీక్రెట్ రివీల్ అయ్యింది. మరి ఆమె అందం సీక్రెట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.

డైట్ ఎందుకంటే?

సంజయ్ లీలా భన్సాలీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది అదితి రావ్ హైదరి. ఈ సిరీస్ లో బిబ్బోజాన్‌గా కనిపించిన హైదరీ తన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే హీరోయిన్లు పర్ఫెక్ట్ షేప్‌లో ఉండటానికి, స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా కనిపించడానికి ఖచ్చితంగా డైట్‌ని ఫాలో అవ్వాలి. అలాగే అదితి కూడా ఫిట్‌గా ఉండటానికి ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సీక్రెట్ డైట్ గురించి వెల్లడించింది.

అదితి రావ్ హైదరి డైట్ సీక్రెట్

‘వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే’ అనే సెగ్‌మెంట్‌లో అదితి తన చీట్ మీల్స్, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, ఇష్టమైన ఆరోగ్యకరమైన స్నాక్స్ తో పాటు తనకున్న మరిన్ని ఆహారపు అలవాట్ల గురించి వివరంగా మాట్లాడింది.

- Advertisement -

డైట్‌లో ఎలాంటి కఠినమైన రూల్స్ ఫాలో అవుతారు అనే ప్రశ్నకు అదితి స్పందిస్తూ ”నేను గ్లూటెన్ తినకూడదని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను గోధుమలను తినను. ఎందుకంటే నాకు గ్లూటెన్ ఎలర్జీ ఉంది. అందుకే ఎక్కువ తినకూడదని ప్రయత్నిస్తాను. అలాగే నా ముందు నిజంగా అద్భుతమైన జున్ను ఉంటే ఖచ్చితంగా దానిని తింటాను. అదంటే నాకు చాలా ఇష్టం. కానీ మళ్ళీ నేను పెరుగు తినలేను” అని చెప్పింది.

IWMBuzz on X: "Aditi Rao Hydari Looks Ethereal Beauty In Traditional Green  Lehenga, See Photos - https://t.co/BUrRfR6A5Z #entertainment #movies  #television #celebrity https://t.co/3WgPUzL1Pi" / Xఅదితికి ఇష్టమైన ఫుడ్

తాను ఆర్గానిక్, నేచురల్ ఫుడ్‌తో సంతోషంగా డైట్ ఫాలో అవుతున్నాను అని అదితి తెలిపింది. కొన్నిసార్లు మాత్రం రూల్స్ ఫాలో అవ్వకుండా చాక్లెట్ లేదా గోల్గప్పా (పానీ పూరీ) తినడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

సౌత్ ఫుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్

దక్షిణ భారతీయురాలు కావడంతో అదితి అల్పాహారంగా సౌత్ ఫుడ్ ను ఇష్టపడుతుంది. ఎక్కువగా ఇడ్లీలు తింటుందట. మధ్యాహ్న భోజనం కోసం ఆమె క్వినోవాతో ఎక్కువగా శాఖాహార భోజనాన్ని ప్రిఫర్ చేస్తుంది. రాత్రి భోజనంలో చేపలు లేదా చికెన్ వంటి ప్రోటీన్‌లను తీసుకోవడానికి ఇష్టపడుతుందట.

మార్నింగ్ డ్రింక్..

ఉదయాన్నే అదితి కొన్నిసార్లు బుల్లెట్ కాఫీ, వేప రసం లేదా అల్లం రసం తీసుకుంటుందట.

అదితి రావు హైదరీ చీట్ మీల్

తనకు ఇష్టమైన చీట్ మీల్ గురించి అడిగినప్పుడు, అదితి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాను డైట్ లో ఉన్నప్పుడు చీట్ చేయకూడదని ప్రయత్నిస్తుందట. అయితే కొన్నిసార్లు మాత్రం పిజ్జా తింటానని చెప్పింది. ఇక తనకు మఖానా అంటే చాలా ఇష్టమని చెప్పింది.

అదితి రావ్ హైదరీ నెక్స్ట్ ఏంటి?

హీరామండిలో చివరిసారిగా కనిపించిన అదితి రావు హైదరీ లైనప్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. విజయ్ సేతుపతితో ఓ మూవీ, ఆంగ్ల చిత్రం లయనెస్ కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు