Alia Bhatt: 160 యేళ్ళ నాటి చీర ధరించిన అలియా.. ప్రత్యేకతలు, ధర తెలిస్తే హార్ట్ ఎటాక్..!

Alia Bhatt.. మగువలు మెచ్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన వస్తువులలో చీరలు మొదటి పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా ఎలాంటి అమ్మాయి అయినా సరే చీర కట్టిందంటే చాలు ఆ చీరకే అందం వస్తుంది.. అందుకే అమ్మాయిలు కూడా తాము ధరించే దుస్తులలో ఎక్కువగా చీరలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే పలు అకేషన్ లకు ప్రత్యేకంగా చీరలను డిజైన్ చేయించుకొని మరీ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా అత్యంత ఘనంగా రూ.10వేల కోట్ల ఖర్చుతో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహాన్ని జరిపిస్తున్నారు అని సమాచారం. ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలు, బిజినెస్ మాగ్నెట్లు ఒక్కొక్కరిగా హాజరవుతూ తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అలియా భట్ కూడా అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడమే కాదు తన దుస్తులతో అందరిని మాట్లాడుకునేలా చేసింది. తాజాగా అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో ఆలియా భట్ కూడా చీర ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఇకపోతే చీర ధరించడమే కాదు ఆ చీర ప్రాముఖ్యత తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Alia Bhatt: Alia wearing a 160-year-old saree.. Heart attack if you know the special features and price..!
Alia Bhatt: Alia wearing a 160-year-old saree.. Heart attack if you know the special features and price..!

160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించిన ఆలియా..

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా ఎరుపు రంగు చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇక ఈ చీర ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 160 సంవత్సరాల క్రితం తయారుచేసిన చీర అది. అత్యంత స్వచ్ఛమైన పట్టుతో చీరను నేసారట.. డిజైనర్ మనీష్ మల్హోత్రా కలెక్షన్ కు చెందిన ఈ చీర ప్రత్యేకత దాని వయసే అని చెప్పాలి.. 160 సంవత్సరాల క్రితం గుజరాత్ లో నేసిన ఆశావళి చీర ఇది.. 99 శాతం స్వచ్ఛమైన వెండి, 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం కలగలిపి నేసిన నిజమైన జరీ అంచుతో ఉంటుంది.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన చీరను అలియా భట్ ధరించింది . ఇక అలియా ఒంటిపై ధగధగలాడిపోయిన ఈ చీర గురించి ప్రస్తుతం మగవల మధ్య చర్చ నడుస్తోంది అని చెప్పవచ్చు. అసలే నేచురల్ బ్యూటీ.. పాలమీగడలా మెరిసిపోతూ ఉంటుంది.. ఇలాంటి ఈమె వెండి , బంగారం కలగలిసిన ఎరుపు రంగు చీరను ధరించి ఆ చీరకే కాదు తన అందాన్ని కూడా రెట్టింపు చేసుకుంది. అంతేకాదు సాంప్రదాయాలు ఎప్పుడు ఫ్యాషన్ కి దూరంగా ఉండవు అని కూడా ప్రూవ్ చేసింది. ఇక మోడ్రన్ టచ్ ను జోడించడానికి స్టాప్ ప్లస్ బస్టియర్ బ్లౌజ్ ధరించింది ఈ ముద్దుగుమ్మ.

అలియా ధరించిన చీర ధర ఎంతంటే..

ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ చీర ధర ప్రస్తుత ధర తెలిస్తే మగువలకు హార్ట్ ఎటాక్ రావాల్సిందే.. దీని ధర అక్షరాల రూ .2కోట్ల పై మాటే.. స్వచ్ఛమైన బంగారు, వెండి, పట్టుతో నేసిన చీర కాబట్టి దీని ధర అంత పలుకుతోందని సమాచారం. ఏదేమైనా ఇలాంటి ఖరీదైన పురాతనమైన చీర ధరించి.. అంబానీ పెళ్లి వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు