Ananya Pandey : కొత్త కారు, కొత్త బాయ్ ఫ్రెండ్… కోట్ల విలువ చేసే కాస్ట్లీ కారు కొన్న దేవరకొండ హీరోయిన్

Ananya Pandey : లైగర్ డిజాస్టర్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సినిమాల కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. కొంతకాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోతో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని, ఆ తర్వాత బ్రేకప్ జరిగిందని, ఇప్పుడు మరో సెలబ్రిటీతో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తోందని ఓవైపు రూమర్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అనన్య కాస్ట్లీ కారు కొనడం హాట్ టాపిక్ గా మారింది.

కొత్త కారు, కొత్త బాయ్ ఫ్రెండ్…

గత కొన్ని రోజుల నుంచి అనన్య పాండే బాలీవుడ్ స్టార్ ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఓవైపు ఇలాంటి రూమర్లు నడుస్తుంటే మరోవైపు ఈ జంట ఎక్కడ పడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఎన్నోసార్లు కెమెరా కంటికి చిక్కారు. రెస్టారెంట్స్, ఈవెంట్స్, పార్టీలలో కూడా ఇద్దరూ కలిసే కనిపించేవారు. దీంతో ఈ జంట డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతలోనే ఏమైందో కానీ సడన్ గా వీరిద్దరూ విడిపోయారు అంటూ కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే బ్రేకప్ జరగింది అంటూ వచ్చిన వార్తలపై వీరిద్దరూ ఇప్పటిదాకా స్పందించలేదు. అలా ఆ వార్తలను మర్చిపోకముందే ఈ ముంబై భామ తాజాగా విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తోందంటూ కొత్త ప్రచారం మొదలైంది.

దానికి సాక్ష్యంగా అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ కలిసి జంటగా డాన్స్ చేయడం, ఇద్దరూ కలిసి ఒకరి కళ్ళలోకి మరొకరు సూటిగా చూసుకోవడం వంటివి ఉన్న వైరల్ వీడియోను చూపిస్తున్నారు. అంతేకాదు ఇద్దరూ ఇన్స్టా లో ఒకరిని ఒకరు ఒకేసారి ఫాలో అవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా అనన్య పాండే లగ్జరీ కారు కొని వార్తల్లో నిలిచింది. దీంతో అనన్య కొత్త కారు, కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

अनन्या पांडे की नई लग्जरी कार से ज्यादा तो हाथ में लगी मेहंदी ने खींचा  ध्यान, इस SUV की कीमत भी कर देगी हैरान - ananya panday flaunts her mehendi  while spotted

కాస్ట్లీ కార్ కొన్న అనన్య…

తాజాగా అన్నయ్య పాండే కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును కొనడం విశేషం. ఈ కారు ధర 3 కోట్లు కాగా, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వైట్ కలర్ రేంజ్ రోవర్ అందరిని అట్రాక్ట్ చేయగా, ఈ బ్యూటీ ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. ఇదిలా ఉండగా లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2022లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆ తర్వాత అనన్యకి టాలీవుడ్ నుంచి పిలుపు రాలేదు. బాలీవుడ్ లో కూడా అనన్య పాండే చేస్తున్న సినిమాల సంఖ్య లైగర్ తర్వాత తగ్గిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఆమె కొత్త రేంజ్ రోవర్ కారుకొని మరోసారి అందరి దృష్టిని తిప్పుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు