Deepika Padukone : త్వరలో తల్లికాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గత వారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్పుల్ చీరలో బేబీ బంప్ తో అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక్ మర్చంట్ సంగీత్ కార్యక్రమానికి హాజరైనప్పుడు దీపిక ఈ చీరను కట్టుకుంది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు తరలివచ్చారు. అయితే అందరి చూపు దీపికపైనే పడింది. అక్కడ అంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ దీపికానే సెంటరాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ చీర ఖరీదు ఎంత, దీని తయారీకి ఎంత సమయం పట్టిందో తెలిస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం ఖాయం.
చీర ధర ఇన్ని లక్షలా?
జూలై 5న ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఈవెంట్ లో దీపికా పదుకొణె ఊదారంగు చీరలో అబ్బురపరిచింది. ఈ ఈవెంట్లో సింపుల్ మేకప్ లుక్‌లో కనిపించిన ఆమె చీరకు సరిపోయే పెరల్ చోకర్ను ధరించింది. ఈ పిక్స్ ను దీపికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ చీరలో బేబీతో అందంగా బేబీ బంప్ తో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
సంగీత్ ఈవెంట్ కోసం దీపిక ధరించిన పర్పుల్ కలర్ చీరను డిజైనర్ కరణ్ తోరానీ డిజైన్ చేశారు. ఈ ఊదారంగు షిఫాన్ చీరలో బంగారు ఎంబ్రాయిడరీ ఉంది. ఈ చీర ఫాబ్రిక్ ఆర్గాన్జా అండ్ జెన్నీ సిల్క్ తో తయారైంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడం ఈ చీర మరో స్పెషాలిటీ. ముత్యాలు, జరీ, తీగలతో డిజైన్ చేశారు. దీన్ని తయారు చేయడానికి 3,400 గంటలు పట్టిందని చెబుతున్నారు. అంతేకాదు ఇది టోరానీ క్లాసిక్ కలెక్షన్ లలో ఒకటి. ఈ రాయల్ చీర ధర రూ.1,39,500, బ్లౌజ్ ధర రూ.46,500, పెట్టీకోట్ ధర రూ.7,500. ఈ చీర మొత్తం ధర సుమారు 1 లక్షా 92 వేల రూపాయలు. దీపికా పదుకొణె కట్టుకున్న ఈ చీర ప్రత్యేకత ఏంటంటే ఆమె బర్త్ డేకు భర్త రణవీర్ సింగ్ దీనిని గిఫ్ట్ గా ఇచ్చారు.
నగలతో మరింత అందంగా
డీప్ నెక్లైన్, హాఫ్-లెంగ్త్ స్లీవ్స్, మ్యాచింగ్ బ్లౌజ్‌తో దీపిక ఈ చీరలో మరింత అందంగా కన్పించింది. ఆమె పెర్ల్ చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, ఉంగరంతో ఈ రాయల్ లుక్ ను కంప్లీట్ చేసింది.
కాగా 6 సంవత్సరాలకు పైగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే 2018లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన 6 సంవత్సరాల తర్వాత వారి ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నారు. కొన్ని నెలల క్రితం దీపికా-రణ్‌వీర్‌లు సోషల్‌మీడియాలో తాము తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు.