Diljit Dosanjh : 2024 సంవత్సరం దిల్జిత్ దోసాంజ్‌కి గోల్డెన్ టైమ్ అన్పిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన సినిమా ‘అమర్ సింగ్ చమ్కిలా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అతను వాంకోవర్‌లో పంజాబీ షోలో కనిపించాడు. ఇప్పుడు దిల్జిత్ అంతర్జాతీయ షో ‘ది టునైట్ షో విత్ జిమ్మీ ఫాలోన్’లో అతిథిగా కనిపించారు. ఈ షోలో దిల్జీత్ కంప్లీట్ పంజాబీ లుక్ లో కనిపించాడు. అయితే అన్నింటికంటే ఎక్కువ ఆయన పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఆ వాచ్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్జిత్ వాచ్ ధర ఎంతంటే?
గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కల్కి సినిమాలో భైరవ యాంతమ్ పాడి టాలీవుడ్ మూవీ లవర్స్ మనసుల్లో ఆయన ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న దిల్జీత్ రీసెంట్ గా జిమ్మీ ఫాలన్ హోస్ట్ చేసిన ది టునైట్ షోలో తొలిసారిగా కనిపించాడు. ఈ షోలో ఆయన GOAT, బోర్న్ టు షైన్‌తో సహా అతని హిట్ ట్రాక్‌లలో పాటలను పాడారు. అతను షో హోస్ట్ జిమ్మీ ఫాలన్కి పంజాబీ నేర్పిస్తూ కనిపించాడు. షో ప్రారంభంలో ఓయే ఆ గయే పంజాబీ అంటూ దిల్జిత్ తనదైన శైలిలో చెప్పడం మరో హైలెట్ అని చెప్పాలి.
ఈ సందర్భంగా దిల్జిత్ దోసాంజ్ తెల్లటి ఎంబ్రాయిడరీ కుర్తా, లుంగీతో కూడిన తెహ్మత్ వేసుకుని, తలపై పాగా పెట్టుకుని స్టైలిష్ గా కన్పించాడు. ఇక వజ్రాలు పొదిగిన అతని గులాబీ బంగారు వాచ్ దిల్జిత్ అవుట్ ఫిట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. దిల్జిత్ పెట్టుకున్న ఆ వాచ్ జైన్ ది జ్యువెలర్ బ్రాండ్ కు చెందినది. ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ స్టెయిన్లెస్ స్టీల్, రోజ్ గోల్డ్ ఆర్ట్‌వర్క్ ధర సుమారు ₹1.2 కోట్లు. ఈ విషయాన్ని సదరు జువెలరీ సంస్థ వారు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇది AP [Audemars Piguet] రాయల్ ఓక్ 41mm మోడల్, మొత్తం వజ్రాలు పొదిగింది. స్టెయిన్లెస్ స్టీల్, రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో దిల్జిత్ కోసం ప్రత్యేకంగా చేశామని వెల్లడించారు. దిల్జిత్ అద్భుతమైన యాక్సెసరీని ధరించడం ఇది మొదటిసారి కాదు. గత నెలలోనే ఆయన తన వాంకోవర్ దిల్-లుమినాటి టూర్లో అదే జువెలర్స్ కస్టమైజ్ చేసిన ఇలాంటి మరో వాచ్‌ను పెట్టుకుని కంపించాడు.
దిల్జిత్ దోసాంజ్ కింగ్ సైజ్ లైఫ్
దిల్జిత్ లైఫ్ స్టైల్ కింగ్ లాగా ఉంటుంది. ముంబైలోని ఖార్‌లో ఉన్న ఆయన విలాసవంతమైన 3BHK అపార్ట్మెంట్ విలువ రూ. 10-12 కోట్లు. కాలిఫోర్నియాలో దిల్జిత్ కు ఒక లగ్జరీ డూప్లెక్స్ కూడా ఉంది. ఇంకా ఆయన కార్స్ కలెక్షన్ విషయానికొస్తే.. దిల్జిత్ దగ్గర అత్యంత కాస్ట్లీయెస్ట్ కారు పోర్స్చే కయెన్ ఉంది. దాని విలువ దాదాపు రూ. 1.93 కోట్లు. పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ G63 AMG కార్లు కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయి.