HBD GV Prakash Kumar : హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ఎంత సంపాదించాడో తెలుసా?

HBD GV Prakash Kumar : తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ పుట్టినరోజు నేడు. మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న జీవీ 38వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటిదాకా ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.

సింగర్ గా కెరీర్ స్టార్ట్

చిన్నప్పటి నుంచి సంగీతంపై అమితమైన ఆసక్తి ఉన్న జి.వి.ప్రకాష్‌ని సినీ రంగానికి పరిచయం చేసింది ఏఆర్‌ రెహమాన్. జి.వి.ప్రకాష్‌కి మేనమామ ఏఆర్‌ రెహమాన్. జెంటిల్‌మన్‌ చిత్రంలోని ‘చిక్కు బుకు చిక్కు బుక్కు రైలే’ పాటను ఆయన స్వరపరిచగా, జివి ప్రకాష్‌ మొదటి పాట పాడారు. ఏఆర్ రెహమాన్ దగ్గర సంగీతం నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగిన జీవీ ప్రకాష్ 2006లో వసంతపాలన్ దర్శకత్వం వహించిన వీల్ చిత్రంతో సంగీత స్వరకర్తగా రంగప్రవేశం చేశారు. ఈ చిత్రానికి ఆయన స్వరపరిచిన పాటలన్నీ హిట్ అవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.

కోలీవుడ్‌లోని విజయ్‌, అజిత్‌, రజనీ తదితర మాస్‌ నటుల చిత్రాలకు సంగీతం అందించి పలు సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ అందుకున్న తరువాత జీవికి క్రమంగా నటనపై ఆసక్తి పెరిగింది. దీని తర్వాత డార్లింగ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జీవీ మిడ్ రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇప్పుడు ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా, మరోవైపు నటుడిగా రాణిస్తున్నాడు.

- Advertisement -

Music Director G V Prakash Kumar Birthday Today - businessoftollywoodపెళ్లి, విడాకులు

2013లో జీవీ తన పెళ్లి చేసుకున్నాడు. జివి ప్రకాష్ తన స్కూల్ ఫ్రెండ్ సింగర్ చైందవిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లయి 11 ఏళ్లు అయిన తర్వాత జివి ప్రకాష్‌, చైందవి ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

జీవీ ఆస్తులు, రెమ్యూనరేషన్

మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ తన భార్య నుండి విడిపోయిన తర్వాత ఈ రోజు తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ప్రొఫెషనల్ యాక్టర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ ఆస్తులు రూ.80 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇది కాకుండా జివి ప్రకాష్‌కు అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

జీవీ ప్రకాష్ సంగీత దర్శకత్వానికి ఒక్కో సినిమాకు 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు హీరోగా 5 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. కానీ ఈ విషయం గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. తమిళ చిత్రసీమలో సంగీత దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. జి.వి. జివి ప్రకాష్‌కుమార్ ప్రొటెక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి మదాయనకూటం చిత్రాన్ని నిర్మించారు.

జీవీకి జాతీయ అవార్డ్

సూర్య చేసిన సూరారైపొట్రు సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. పస్తుతం ఆయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు