HBD Kajal Aggarwal : బర్త్ డే బేబీ కాజల్ ఆస్తులు, సూపర్ కార్ కలెక్షన్ తెలుసా?

HBD Kajal Aggarwal : ఈరోజు అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఎన్ని కోట్లు వెనకేసింది? ఆమె ఆస్తులు ఎంత? కార్ కలెక్షన్ ఏంటి ? అనే విషయాలను ఆరా తీస్తున్నారు అభిమానులు.

మగధీరతో లైఫ్ టర్న్

కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఆ తరువాత కాజల్ చేసిన చందమామ మూవీ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చినప్పటికీ హిట్స్ మాత్రం పడలేదు. అలాంటి తరుణంలో రాజమౌళి తెరకెక్కించిన మగధీర ఆమె కెరీర్ కు ఓ పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోలందరితో కలిసి నటించే అవకాశం దక్కింది కాజల్ కు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు అయితే రామ్ చరణ్ తోనే కాదు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కూడా రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ.

4 saris from Kajal Aggarwal's collection for anyone looking for lightweight options | VOGUE India

- Advertisement -

ప్రియుడితో పెళ్లి, రీ ఎంట్రీ

కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది. 2020లో కాజల్ అగర్వాల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022లో నీల్ కిచ్లు అనే బాబు జన్మించాడు. పెళ్లయ్యాక కూడా సినిమాలలో నటించిన కాజల్ తల్లి కావడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంది. కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్ రీసెంట్ గా సత్యభామ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమా చేస్తోంది. ఇండియన్ 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కాజల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ఇండియన్ 2 తరువాత కాజల్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

కాజల్ ఆస్తులు, లగ్జరీ ఇల్లు

సమాచారం ప్రకారం కాజల్ కు రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. ముంబైలో రూ.6 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది కాజల్ కు.

కాజల్ కార్ కలెక్షన్

కాజల్ దగ్గర కాస్ట్లీ కార్ల కలెక్షన్ ఉంది. ఆడి ఎ4, రేంజ్ రోవర్, స్కోడా ఆక్టావియా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ మాత్రమే కాదు బిజినెస్ విమెన్ కూడా. ఆమెకు బ్యూటీ ప్రోడక్ట్స్ కూడ సంబంధించిన కంపెనీ కూడా ఉంది. దాని ద్వారా కూడా కాజల్ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు