HBD Madhavan : మాధవన్ లగ్జరీ కార్, బైక్ కలెక్షన్… ఎన్ని కోట్లు కూడబెట్టాడో తెలుసా?

HBD Madhavan : మాధవన్ కెరీర్ మొదట్లో సఖి మూవీతో చాక్లెట్ బాయ్, డ్రీం బాయ్, ఆల్ టైమ్ క్రష్ వంటి బిరుదులతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఆ తరువాత విలన్ గా, హీరోగా అన్నీ రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. చివరిగా సైతాన్‌లో కన్పించిన మాధవన్ అంతకు ముందు రాకెట్రీ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. జూన్ 1 న ఆయన 54వ పుట్టినరోజు జరుపుకొనున్నారు. ఈ నేపథ్యంలోనే మాధవన్ ఆస్తుల విలువ, కార్లు, బైకుల కలెక్షన్ ఏంటి అనే సమాచారం బయటకు వచ్చింది.

మాధవన్ నెట్ వర్త్

తాజా సమాచారం ప్రకారం మాధవన్ దగ్గర మొత్తం 115 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. చెన్నైలో భారీ బంగ్లా, ముంబైలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఆయన 10 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.

కార్ బైక్ కలెక్షన్

మాధవన్ దగ్గర ఖరీదైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఆయనకు బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. ప్రస్తుతం మాధవన్ గ్యారేజీలో రూ. 80 లక్షల విలువైన బెంజ్ కారు, రూ. కోటి విలువైన రేంజ్ రోవర్ కారు, రూ. 40 లక్షల విలువైన రోడ్‌ మాస్టర్ క్రూజర్, రూ. 27 లక్షల విలువైన యమహా వీ మ్యాక్స్, 28 లక్షలు బీఎండబ్ల్యూ బైక్‌, 17 లక్షల విలువైన మరో కాస్ట్లీ బైక్‌లు ఉన్నాయి.

- Advertisement -

At 52, R. Madhavan is still a handsome hunk and these pictures prove so!

షిప్ నే కొన్న హీరో

విదేశాల్లో నివసిస్తున్న స్టార్ హీరోలలో మాధవన్ కూడా ఒకరు. ఆయన తన కుటుంబంతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉండడానికి ఓ ఖరీదైన ఇంటిని కొన్నాడు. అది కూడా హాలీవుడ్ స్టార్స్ ఉండే బెవర్లీ హిల్ లో. అయితే ఈ ఇంటిని ఆయన ఎంతకు కొన్నాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అలాగే మాధవన్ సొంతంగా ఓ షిప్ కొన్నారని టాక్ ఉంది. కెప్టెన్ లైసెన్స్ కోసం మాధవన్ ఈ నౌకను కొనగా, కరోనా  కాలంలో మాధవన్ 6 నెలలు ప్రిపేర్ అయ్యి, కెప్టెన్ పరీక్షను రాసి లైసెన్స్ సంపాదించాడు. అంతేకాదు మాధవన్‌ దగ్గర ఆర్సీ పైలట్ లైసెన్స్ కూడా ఉండడం విశేషం.

మాధవన్ తెలుగు, హిందీ సినిమాలు

కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ 3 ఇడియట్స్, ముంబై మేరీ జాన్ వంటి హిందీ చిత్రాల్లో నటించిన మాధవన్ రీసెంట్ గా నటించిన విక్రమ్ వేద సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే అజయ్ దేవగన్ తో కలిసి మాధవన్ నటించిన సైతాన్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగులో ఆయన చివరగా నిశ్శబ్దం, సవ్యసాచి సినిమాల్లో కన్పించారు.

మాధవన్ నెక్స్ట్ మూవీస్

సైంటిస్ట్ నంబిరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న మాధవన్ ఆ సినిమాతో దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇక ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలతో పాటు తమిళంలో టెస్ట్, భాగ్యశాలి సినిమాల్లో మాధవన్ నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు