HBD Shilpa Shetty : ఏడు మార్గాల్లో ఆదాయం… శిల్పా ఆస్తి ఎన్ని కోట్లంటే?

HBD Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఈరోజు తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె 1975 జూన్ 8న సునంద శెట్టి, సురేంద్ర శెట్టి దంపతులకు జన్మించింది. ‘బాజీగర్‌’ సినిమాతో శిల్పా కెరీర్‌ ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఇక  సినిమాలే కాకుండా శిల్పాశెట్టి తన ఫిట్‌నెస్ కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆమె 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి వియాన్, సమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈరోజు శిల్పా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? ఆదాయ మార్గాలేంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏడు ఆదాయ మార్గాలు

శిల్పా శెట్టిని బాలీవుడ్‌లో నటిగా కంటే వ్యాపారవేత్తగా పిలుచుకుంటారు. శిల్పాశెట్టి ఆస్తులు 134 కోట్ల రూపాయలు. ముందు అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న శిల్పా ఆ తర్వాత తన తెలివైన నిర్ణయాలతో వ్యాపారవేత్తగా మారింది. ఆమె వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక శిల్పా భర్త రాజ్ కుంద్రా వివాదాలతో వార్తల్లో నిలిచారు. బెంగుళూరుతో పాటు చాలా చోట్ల ఆమెకు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతే కాకుండా సినిమాల్లో నటించడం, యాడ్స్ చేయడం వంటి వివిధ మార్గాల ద్వారా కోట్లలో ఆదాయం ఆర్జిస్తోంది. నేడు (జూన్ 8) ఆమె పుట్టినరోజు. అందరూ శిల్పాకు అభినందనలు తెలుపుతున్నారు. ఏఎ నేపథ్యంలోనే శిల్పా శెట్టి ఏడు మార్గాలలో ఎలా ఆదాయాన్ని పొందుతుందో తెలుసుకుందాం.

VFX స్టూడియో

శిల్పాశెట్టి 2022లో VFX వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎస్వీఎస్ పేరుతో ఆమెకు వీఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది. ఈ వెంచర్‌లో ఆమె 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ మధ్యకాలంలో వీఎఫ్‌ఎక్స్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో దీని నుంచి బాగానే సంపాదిస్తోంది.

- Advertisement -

Shilpa Shetty crossed all limits of bol*dness in front open dress without wearing bra, user said – take care of age - informalnewz

రెస్టారెంట్ బిజినెస్

శిల్పాకు బాస్టియన్ రెస్టారెంట్ చైన్ ఉంది. 2019లో ఆమె ఈ కంపెనీలో 50% వాటా కొనుగోలు చేసింది. దీనిని రజనీత్ బింద్రా ప్రారంభించారు. ముంబై, బెంగుళూరు వంటి చోట్ల దీనికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి.

బట్టల బ్రాండ్

శిల్పాశెట్టి దుస్తుల బ్రాండ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. 2020లో ఆమె దుస్తుల బ్రాండ్ ‘డ్రీమ్ ఎస్ఎస్’ని ప్రారంభించింది. ఫ్యాషన్ డిజైనర్ చారు, సందీప్ అరోరాతో కలిసి ఆమె స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ కూడా బాగానే నడుస్తోంది.

ఫిట్‌నెస్ యాప్

శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. యోగా చేసి తన ఫిజిక్ ను కాపాడుకుంటుంది. అందుకే ఈ ఏజ్ లో కూడా ఇంకా ఫిట్ గా, అందంగా ఉంది. ఇక ఈ బ్యూటీ సింపుల్ సోల్ : శిల్పా శెట్టి అనే ఫిట్‌నెస్ యాప్‌ను ప్రారంభించింది.

బ్రాండ్ ప్రమోషన్

శిల్పా శెట్టి చాలా బ్రాండ్‌లకు ప్రమోషన్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీని ద్వారా ఆమెకు భారీగా డబ్బులు అందుతున్నాయి.

పెట్టుబడి

శిల్పా చాలా వెంచర్లలో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఏటా లబ్ధి పొందుతున్నారు.

సినిమాలు

శిల్పా ఇప్పటికీ రంగుల ప్రపంచంతో టచ్‌లోనే ఉంది. సినిమాల్లో నటించడంతో పాటు దీనికి తోడు రియాల్టీ షోలలో జడ్జిగా పాల్గొంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు