Hero Yash Assets: కేజీఎఫ్ స్టార్ హీరో యష్ ఆస్తి విలువ అన్ని రూ. కోట్లా..?

Hero Yash Assets.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టీవీ యాక్టర్ గా మారి ఇప్పుడు హీరోగా చలామణి అవుతున్న హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో సీరియల్స్ చేసుకుంటూ కేవలం కన్నడ బుల్లితెరకే పరిమితమైన యష్ ఆ తర్వాత పలు యాడ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక కే జి ఎఫ్ 2 తో తిరుగులేకుండా చేసుకున్నారు యష్. ప్రస్తుతం ఈయన చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో ..? అసలు ఎలాంటి కథతో వస్తున్నారో ..? తెలుసుకోవడానికి అభిమానుల సైతం చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈయన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.

హీరో యష్ లగ్జరీ లైఫ్..

Hero Yash Assets: KGF star Hero Yash's assets are worth all the crores..?
Hero Yash Assets: KGF star Hero Yash’s assets are worth all the crores..?

2000వ సంవత్సరంలో టీవీ ఆర్టిస్ట్ గా తెరపైకి వచ్చిన యష్ ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. నిరంతరం శ్రమించి నేడు కన్నడ స్టార్ హీరోగా ఎదిగారు. నటన, డాన్స్ , డైలాగులతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆఫ్ స్క్రీన్ లో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.. ఇక ఈయన ప్రస్తుత ఆస్తి విలువ రూ .500 కోట్లకు పైమాటే.. సినిమాల ద్వారా సంపాదించే డబ్బును రియల్ ఎస్టేట్ తో పాటు అనేక కంపెనీలలో పెట్టబడులుగా పెట్టినట్లు సమాచారం.. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఇక అలాగే ఇతర పెట్టుబడుల ద్వారా కూడా సంవత్సరానికి రూ .10 కోట్లకు పైగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

డూప్లెక్స్ హౌస్ తో పాటు ఖరీదైన కార్లు కూడా..

పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదించిన ఈయన.. లగ్జరీ హౌస్ తో పాటు ఖరీదైన కార్లు కూడా కొనుగోలు చేశారు.. బెంగళూరులో రూ.4కోట్ల విలువైన డూప్లెక్స్ హౌస్ తో పాటు రూ .6కోట్లకు పైగా విలువైన భూమి అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.. అంతేకాదు ఈయన కార్ గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.. గత ఏడాది రూ .5కోట్ల విలువైన రేంజ్ రోవర్ కూడా ఆయన గ్యారేజ్ లోకి వచ్చి చేరింది. రూ. 25 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ డి ఎల్ ఎస్ 350D కార్ కూడా ఈయన సొంతం.. అలాగే రూ .70 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రేంజ్ రోవర్ ఈవోక్ కార్లతో పాటు రూ .78 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ సి 250d, రూ.80 లక్షల విలువైన ఆడి క్యూ 7, రూ.70 లక్షల విలువైన బీ ఎమ్ డబ్బ్లూ 520D, రూ.35 లక్షలు విలువైన పజేరో స్పోర్ట్స్ కారు వంటి ఖరీదైన కార్లు గ్యారేజ్ లో ఉన్నాయి.

- Advertisement -

యష్ రెమ్యూనరేషన్..

కే జి ఎఫ్ 2 సినిమాకు రూ.30 కోట్ల పారితోషకం తీసుకున్న హీరో యష్.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఇమేజ్ దక్కించుకోవడంతో తాజాగా నటిస్తున్న టాక్సిక్ సినిమా కోసం రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.. పాన్ ఇండియా లో యష్ మార్కెట్ చూసి నిర్మాతలు కూడా కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.. ఇక టాక్సిక్ సినిమా విషయానికొస్తే.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. సంయుక్త మీనన్ , నవాజుద్దీన్ సిద్ధికి, షైన్ టామ్ క్రూజ్, ధనుంజయ్ తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు