Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో మరో స్టార్ హీరో అద్దెకు దిగుతున్నాడని సమాచారం. మరి ఆ ఇంటి ధర ఎంత? హృతిక్ ఇంటిని అద్దెకు తీసుకోబోతున్న స్టార్ ఎవరు? అనే విషయాల్లోకి వెళ్తే..
హృతిక్ ఇంట్లో అద్దెకి వరుణ్
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ రీసెంట్ గా తండ్రి అయ్యాడు. అతని భార్య, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ జూన్ 3న హిందూజా ఆసుపత్రిలో అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న వరుణ్ ధావన్ కొత్త ఇంట్లోకి ఫ్యామిలీతో సహాయ మారడానికి సిద్ధమవుతున్నాడు. సమాచారం ప్రకారం ముంబైలోని జుహులో ఉన్న హృతిక్ ఇంటిని వరుణ్ అద్దెకి తీసుకోబోతున్నాడు.
వరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు?
వరుణ్ ధావన్, నటాషా దంపతులు ప్రస్తుతం జుహులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. 2017లో వరుణ్ ధావన్ ఆ అపార్ట్మెంట్ ను కొన్నాడు. అయితే కూతురు పుట్టాక ఆయన విలాసవంతమైన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఉండాలని భావిస్తున్నాడట. అందుకే హృతిక్ రోషన్ ఇంట్లో వరుణ్ ధావన్ అద్దెకు ఉండబోతున్నాడని సమాచారం.
ముంబైలోని జుహులో ఉన్న హృతిక్ రోషన్ సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌కి వరుణ్ ధావన్ మారుతున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వార్తలు గనుక నిజమైతే అక్షయ్ కుమార్, సాజిద్ నడియావాలా వంటి సెలబ్రిటీలను వరుణ్ దంపతులు పొరుగువాళ్ళు అవుతారు. కూతురు పుట్టిన తర్వాత వరుణ్ ధావన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ హిందీ హీరో వివాహం నటాషా దలాల్ తో అలీబాగ్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ నటీనటులు తరలివచ్చారు. కొన్ని రోజుల క్రితమే తాను తండ్రి కబోతున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు వరుణ్.
ఆ ఇంటి ధర
వరుణ్ అతని భార్య నటాషా త్వరలో వారి నవజాత కుమార్తె, పెంపుడు కుక్క జాయ్‌తో కలిసి కొత్త ఇంటికి మారనున్నారు. ఈ ఇల్లు అద్భుతమైన సీ వ్యూను కలిగి ఉంది. అంతేకాదు ఏఎ ఇంటి నుంచి జుహు బీచ్‌కి ప్రైవేట్ యాక్సెస్ కూడా ఉంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి దాదాపు రూ.50 కోట్ల విలువైన ఈ ఇంట్లో నివసించాడు. ఇప్పుడు 100 కోట్ల రూపాయల విలువైన మరో పెద్ద ఇంట్లో ఉంటున్నాడు గ్రీక్ గాడ్.
వరుణ్ సినిమాలు
వరుణ్ ఈ సంవత్సరం చాలా చిత్రాలలో కనిపించబోతున్నాడు. ఒక వైపు అతను సౌత్ పాపులర్ దర్శకుడు అట్లీ మూవీ ‘బేబీ జాన్’లో నటిస్తున్నాడు. మరోవైపు ఆయన నటించిన దర్శకుడు శశాంక్ ఖైతాన్ మూవీ ‘దుల్హనియా 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫాదర్ డేవిడ్ కామెడీ మూవీతో పాటు వరుణ్ కిట్టిలో ‘దేశీ బాయ్జ్ 2’, ‘డెడ్లీ’ కూడా ఉన్నాయి. సమంతా రూత్ ప్రభుతో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు హృతిక్ తారక్ తో కలిసి వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.