Lifestyle: పాపులర్ అవ్వాలి అనుకుంటే ఈ అలవాట్లను వదిలి పెట్టండి

పాపులర్ అవ్వాలని ఎవరికి ఉండదు? అందరూ మనల్ని ఇష్టపడాలని, మనలాగా ఉండాలని కోరుకుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ కొన్నిసార్లు తెలియకుండానే మనం చేసే పనులు మనకు శత్రువులను సృష్టిస్తాయి. మనల్ని చూస్తే పారిపోయేలా చేసే అలవాట్లు కొన్ని ఉంటాయి. వాటి గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం మనల్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే కచ్చితంగా కారణం మనమే. మరి అందరూ మనల్ని చూసి ఇష్టపడాలంటే, మన గురించే ఎక్కువగా మాట్లాడుకోవాలి అని అనుకుంటే కొన్ని అలవాట్లను మార్చుకోక తప్పదు. ఈ అలవాట్లు మార్చుకుంటే తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఇష్టపడతారు. దీంతో పాపులర్ అవడం అంత కష్టమేమీ కాదు. మరి మార్చుకోవాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పాట్ లైట్ మూమెంట్ ను ఎవరైనా ఇష్టపడతారు. కానీ ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉండడం, మీ అభిప్రాయాలను మాత్రమే పంచుకోవాలి అనుకోవడం, వాటి వల్ల అవతలి వ్యక్తులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోకపోవడం తప్పు. వినయంగా ఉండే వ్యక్తుల్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ గురించి తక్కువ ప్రస్తావన ఉండేలా చూసుకోండి.

ఇక పరిస్థితి ఎలాంటిదైనా నెగిటివ్ గా తీసుకునే వాళ్ళని చూస్తే ఎవరైనా పారిపోతారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువమంది ఇష్టపడాలి అనుకుంటే పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. పరిస్థితుల గురించి లేదంటే ఇతరుల గురించి కంప్లైంట్స్ ఇవ్వడం మానుకోండి. మంచి అంశాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. పాజిటివిటీ అంటువ్యాధి లాంటిది. ఒక్కసారి మీ నుంచి పాజిటివ్ వచ్చిందంటే మీతో ఉండడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడతారు.

- Advertisement -

పర్సనల్ స్పేస్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఫిజికల్ గా అయినా లేదంటే మెంటల్ గా అయినా పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి. మనకు క్లోజ్ గా ఉండే వారితో ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండడం, సమయం సందర్భం లేకుండా ఫోన్లు, మెసేజ్లు చేస్తూ ఉండడం అవతలి వ్యక్తులను ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఇతరుల పర్సనల్ స్పేస్ ను గౌరవించడం నేర్చుకుంటే జనాలు మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు.

గాసిప్స్ అనేవి ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. దాని బదులు ఎనర్జిటిక్ గా ఉండే అంశాలపై దృష్టి పెట్టండి. పాజిటివ్ గా ఉండే అంశాలను ఇతరులతో చర్చించండి.

చాలామంది చేసిన తప్పును ఒప్పుకోకుండా వాదనకు దిగుతుంటారు. ప్రపంచంలో ఎవ్వరు పర్ఫెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి ఏం నేర్చుకుంటున్నాం? ఎలా డెవలప్ అవుతున్నాం? అనేది ముఖ్యం. చేసిన తప్పును ఒప్పుకోకుండా వాదిస్తే దాన్ని అహంకారంగా చూస్తారు ప్రజలు. ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకుని చేసిన తప్పును ఒప్పుకుని చూడండి. అలాంటివారును ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు గౌరవిస్తారు.

ఇక చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకోకపోవడం వంటి అలవాటు ఉంటే జనాలు మీ దగ్గరికి రావడానికి అసలు ఆసక్తి చూపించరు. అంతేకాకుండా ప్రతి ఒకరిని సంతోష పెట్టడం ఎవరివల్లా కాదు. జనాలకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాబట్టి అందరిని సంతోష పెట్టాలి అని ఏదో ఒకటి చేస్తూ ఉండకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. ఇక జడ్జి మెంటల్ గా ఉండే వ్యక్తులను తక్కువగా ఇష్టపడతారు. కాబట్టి అవతలి వ్యక్తుల గురించి జడ్జ్ చేయడం ఆపేయండి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వంటి అలవాటు ఉంటే అది మిమ్మల్ని బాగా పాపులర్ చేస్తుంది. కాబట్టి మీ పనిని మీరు మాత్రమే చేసుకోకుండా మీకు అవసరమైనప్పుడు హెల్ప్ తీసుకోండి. అలాగే అవతలి వ్యక్తులకు హెల్ప్ చేయండి. ఇక ప్రశంసలకు పడని వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి సమయాన్ని సందర్భాన్ని బట్టి అవతలి వ్యక్తిని పొగుడుతూ ఉండండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు