Imposter Syndrome : అవమానాలే ఈ వ్యాధికి కారణం… ఇంపోస్టర్ సిండ్రోమ్ ను ఎలా కంట్రోల్ చేయాలంటే?

నగరాల్లో ఉండే ఈ ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో లైఫ్ స్ట్రెస్ ఫుల్ గా మారుతోంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడి పెరిగి తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. ఆ తరువాత ఒత్తిడి కారణంగా మానసిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందులో ఒకటి ఇంపోస్టర్ సిండ్రోమ్. ఎక్కువగా అవమానాలను ఎదుర్కొన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్‌తో బాధపడే వ్యక్తి తనపై తాను నమ్మకాన్ని కోల్పోతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైద్యులు కూడా ఈ వ్యాధిని ముందుగా పసిగట్టలేరు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తి ఎక్కువగా నెగెటివ్ గా మాట్లాడతాడు. తన జీవితంలో ఏదైనా మంచి జరిగినా అతనికి సంతోషం కలగదు. క్రమంగా అతను ఆందోళన, నిరాశకు గురవుతాడు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఈ వ్యాధి మీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరి ఇంపోస్టర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి? ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంపోస్టర్ సిండ్రోమ్‌ లక్షణాలు

1. సక్సెస్ ను అనుమానించడం
2. తమ స్కిల్స్, సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడం
3. సక్సెస్ సాధించినా సంతోషంగా ఉండకపోవడం. మీ సక్సెస్ కు క్రెడిట్‌ని మరొకరికి ఇవ్వండి.
4. చాలా కష్టతరమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం. ఆ టార్గెట్ ను రీచ్ కాలేకపోతే నిరాశ చెందడం
5. ప్రజల అంచనాలను అందుకోలేక పోతున్నామన్న భయం కలగడం.
6. ఎప్పుడూ నెగెటివ్ గా ఆలోచించడం

ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను ఎలా కంట్రోల్ చేయాలి ?

1. ఏదైనా డౌట్ మీ మైండ్ లోకి వస్తే వెంటనే దాన్ని క్లియర్ చేయండి. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కూర్చోవడం లేదా నెగెటివ్ గా ఆలోచించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అందువల్ల ఆలోచనలు, ఎమోషన్స్ ను మీకు దగ్గరగా ఉన్న వారితో లేదా స్నేహితునితో పంచుకోవడం చాలా ముఖ్యం.

- Advertisement -

2. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ఎవరికైనా మీ హెల్ప్ అవసరమైనప్పుడు సహాయం చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. .

3. మీ సామర్థ్యాలను అర్థం చేసుకోండి. మీపై నమ్మకం ఉంచండి. మీకు మీపై ఎప్పుడైనా నమ్మకం లేకపోతే మీ విజయాలను ఒకే చోట వ్రాసి మీ గురించి మీరే గర్వపడండి.

4. ఏదైనా పనిని పూర్తి చేయడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. బదులుగా మీ పనిని చిన్న భాగాలుగా విభజించండి. దీనితో మీ పని సులభంగా పూర్తవుతుంది. అలాగే ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

5. మిమ్మల్ని ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకండి, ఇది మీలో నెగెటివ్ ఆలోచనలను రేకెత్తిస్తుంది.

6. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినండి మరియు తక్కువగా మాట్లాడండి

7. సోషల్ మీడియాలో ఏదైనా చూసిన తర్వాత తదనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే సంతోషంగా ఉండండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే ఇంపోస్టర్ సిండ్రోమ్‌ ను ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు. లేదంటే సైకాలజిస్టును సంప్రదించండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు