International Yoga Day 2024 : హీరోయిన్ల ఫిట్ నెస్ సీక్రెట్… యోగా పిచ్చి ఉన్న హీరోయిన్లు వీళ్లే

International Yoga Day 2024 : నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి యోగాను తన రొటీన్‌లో భాగంగా చేసుకున్న సౌత్ యోగా క్వీన్స్ ఎవరో తెలుసుకుందాం పదండి.

article_image5

సౌత్ హీరోయిన్ల ఫిట్ నెస్ సీక్రెట్

హీరోయిన్ అనగానే అందంగా, ఫిట్ గా ఉండే ముఖాలు గుర్తొస్తాయి. అయితే అంత ఫిట్ గా ఉండాలంటే సెలబ్రిటీలు కఠినమైన డైట్, వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఇలా అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఎంచుకునే బెస్ట్ ఆప్షన్ యోగా. ఒత్తిడి, గుండె సమస్యలు, బరువు తగ్గడం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తమ వ్యాయామ రొటీన్ లో యోగాను చేర్చుకున్న పలువురు ప్రముఖ దక్షిణ భారత నటీమణుల ఎవరో గురించి యోగా డే సందర్భంగా చూద్దాం.

- Advertisement -

article_image2

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అనుష్క గురించే. ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా పని చేసింది అనే విషయం ఆమె అభిమానులకు తెలిసే ఉంటుంది. తరువాత సౌత్ క్వీన్ సమంత. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఆమె తన ఫిట్‌నెస్ రొటీన్‌లో యోగాను కూడా చేర్చుకుంది. ఇందుకు సంబంధించి సామ్ సోషల్ మీడియా పోస్టులు ఇదివరకు చాలానే చూశాం. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫిట్‌గా ఉండటానికి వ్యాయామంతో పాటు యోగా చేస్తుంది. కొన్ని కష్టమైన ఆసనాలు కూడా వేస్తుంది ఈ బ్యూటీ. హన్సిక మోత్వాని బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తోంది. దీంతో ఒకప్పుడు బాగా లావైపోయిన ఈ అమ్మడు ఇప్పుడు ఆరోగ్యకరమైన శరీర ఆకృతిని సొంతం చేసుకుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ యోగాను చాలా సీరియస్‌గా ఫాలో అవుతుంది.

article_image3

సీనియర్ హీరోయిన్లకు వరంగా మారిన యోగా

బాలీవుడ్ లో మంచి ఫిట్‌నెస్ ఉన్న హీరోయిన్ అనగానే శిల్పాశెట్టి కుంద్రా పేరు వెంటనే గుర్తుకు వస్తుంది. ఈ లిస్ట్ లో ఉన్న రెండో పేరు మలైకా అరోరా. మలైకా బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారింది.
అలియా భట్ తన టోన్డ్ ఫిగర్, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సహాయం తీసుకునే మరో బాలీవుడ్ దివా. యోగా అంటే పిచ్చిగా ఉండే హీరోయిన్లలో కరీనా కపూర్ పేరు అస్సలు మిస్ అవ్వకూడదు. కరీనా మంచి షేప్‌లో ఉండేందుకు క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె కూడా యోగా చేయనిదే నిద్రపోదు. అలా సీనియర్ హీరోయిన్లందరికీ ఫిట్ నెస్ విషయంలో యోగా వరంలా మారింది. వీళ్ళతో పాటు బాలీవుడ్ లో నేటి తరం హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ కూడా యోగా చేస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు