Jr NTR : తారక్ లగ్జరీ లైఫ్ స్టైల్…. ఎన్ని వందల కోట్లకు వారసుడంటే ?

Jr NTR : సౌత్ ఇండియాలో మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ మైంటైన్ చేసే స్టార్ హీరోలలో తారక్ కూడా ఒకరు. మరి ఈ హీరో ఒక్క సినిమాకు ఎంత సంపాదిస్తున్నాడు? యంగ్ టైగర్ ఎన్ని వందల కోట్లకు వారసుడు ? అనే వివరాల్లోకి వెళ్తే…

బర్త్ డేకు ట్రిపుల్ ట్రీట్…

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్ మూవీ’ సూపర్ హిట్ కావడంతో ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. పలు అవార్డు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఆటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’, హిందీలో ‘ వార్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మే 20న ఆయన పుట్టినరోజు. ఈ ప్రత్యేకమైన రోజున అభిమానులకు ‘దేవర’, ‘వార్ 2’ సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ప్రశాంత్ నీల్ తో తారక్ చేస్తున్న సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే స్వయంకృషితో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆస్తులు సంపాదించాడు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.

బాల నటుడిగా ఎంట్రీ…

ఆంధ్రా మాజీ సీఎం, దివంగత నట దిగ్గజం నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘రామాయణం’ సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ‘రామాయణం’ చిత్రానికి ‘ఉత్తమ పిల్లల చిత్రం’ విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నాడు చిన్నప్పుడే. 2001లో విడుదలైన ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి ఆయన వేణు దిరిగి చూసుకునే అవసరం రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రశంసలు అందుకున్నారు.

- Advertisement -

450 కోట్లకు వారసుడు

జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి ప్రస్తుతం 450 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్టింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగానే వసూలు చేస్తున్నాడు తారక్. ఒక్కో సినిమాకు రూ.50-60 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని అంటున్నారు.

లగ్జరీ బంగ్లా…

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు విలాసవంతమైన బంగ్లా ఉంది. దాని ఖరీదు రూ. 25 కోట్లు ఉంటుంది. అతనికి హైదరాబాద్ సమీపంలో ఫామ్‌హౌస్, బెంగళూరు, ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి.

9 కోట్ల వ్యవసాయ భూమి

హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో తారక్ కు ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాని విలువ 9 కోట్లకు పైనే.

స్పెషల్ జెట్….

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది.

వాచ్ కలెక్షన్…

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన వాచీలు ఉన్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన కాస్ట్లీ వాచ్ కలెక్షన్ ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం.

కార్ల కలెక్షన్…

తారక్ కు కార్లంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆయన గ్యారేజిలో రూ. 5 కోట్ల నీరో నోక్టీస్ అనే బ్లాక్ కారు, రూ.3. 17 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉంది. ఈ కారుకు ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్ చేయించడం కోసం తారక్ ఏకంగా 15 లక్షలు ఖర్చు చేశాడు. ఇది అత్యంత ఖరీదైన కారు కాగా ఇండియాలోనే ఈ కారును కొన్న మొట్ట మొదటి హీరో తారక్ కావడం విశేషం. ఇంకా రూ.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ, రూ. కోటి విలువైన పోర్షే కార్లు ఆయన దగ్గర ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు