Kiccha Sudeep: ఆ జాబితాలో స్థానం.. ఎన్ని కోట్లకు అధిపతి అంటే..?

Kiccha Sudeep.. ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఒక్కో సినిమాకు భారీగానే పారితోషకం తీసుకుంటారు. ఇక ఈ రంగుల ప్రపంచంలోకి ఈయన అడుగుపెట్టి ఇప్పటికి 28 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయింది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన దర్శకుడు కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. అందులో భాగంగానే దర్శకుడిగా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఈయనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం.. ఒకవైపు హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు తెలుగులో విలన్ గా కూడా నటించి సత్తా చాటారు కిచ్చా సుదీప్.. ఇదిలా ఉండగా తాజాగా సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరోల జాబితాలో చేరిపోయారు.. మరి సుదీప్ ఆస్తులు ఎంత అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Kiccha Sudeep: The position in that list.. is the head of how many crores..?
Kiccha Sudeep: The position in that list.. is the head of how many crores..?

ధనిక జాబితాలో చోటు.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కిచ్చా సుదీప్ ఆస్తుల విలువ మొత్తం రూ.130 కోట్లు.. సినిమాలు , బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. వీటి తర్వాత ఎన్నో కార్లు కూడా ఆయన కొనుగోలు చేశారు.. ప్రస్తుతం తన ఇమేజ్ ను బట్టి ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే బెంగళూరులో సుదీప్ కి సొంత బంగ్లా ఉంది.. దీని ఖరీదు సుమారుగా రూ.20 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువగా భూముల పైన ఇన్వెస్ట్ చేశారు.. ముంబైలో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. భూముల ధరలు ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో కిచ్చా సుదీప్ ఆస్తుల విలువ కూడా పెరుగుతున్నట్లు సమాచారం.

హీరో గానే కాదు నిర్మాత కూడా..

హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టారు.. సుదీప్ “కిచ్చా క్రియేషన్స్” అనే ఒక నిర్మాణ సంస్థ కూడా ఉంది.. దీని ద్వారా ఆయన సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. చాలా సినిమాలలో పెట్టుబడి పెట్టారు కూడా.. అలాగే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు ఒక్కో బ్రాండ్ కు 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

కార్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా..

అలాగే ఈయనకు కార్ లంటే చాలా పిచ్చి.. అందుకే తన కార్ గ్యారేజీలో రూ.కోట్ల విలువైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా వెల్ ఫైర్, లంబోర్గిని, స్లీక్ హమ్మర్ 3, బీఎండబ్ల్యూ, జీప్ కంపాస్ వంటే ఖరీదైన లగ్జరీ కార్లో ఈయన దగ్గర ఉన్నాయి.

సుదీప్ హీరోగానే కాదు విలన్ గా కూడా..

సుదీప్ నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఈగ సినిమాలో తన అద్భుతమైన నటనతో.. విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇక తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించిన ఈయన అటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారని చెప్పవచ్చు.. దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా మారి హీరోగా చలామణి అవుతూ విలన్ గా కూడా తనను తాను మార్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అత్యంత ధనిక జాబితాలో చేరిపోయారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు