Misophonia : ఇతరుల దగ్గు, త్రేన్పు చిరాకు తెప్పిస్తోందా? ఈ జబ్బే కారణం

Misophonia : ఇతరులు దగ్గినా, తుమ్మినా లేదా ఆహారం నమిలే సౌండ్ వచ్చినా, ఆవులించడం, ఈలలు వేయడం, గురక, త్రేన్పు వంటి శబ్దాలు విన్నప్పుడు చిరాకు వస్తుందా? సాధారణంగా ఇలాంటి వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమందికి మాత్రం ఈ చిన్న చిన్న విషయాలే అతిపెద్ద సమస్యగా మారుతాయి. మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఈ సమస్యనే వైద్య పరిభాషలో మిసోఫోనియా అని అంటారు. ఈ జబ్బు కారణంగా బాధపడేవారు ఎవరైనా తమ ఎదురుగా దగ్గినా, తుమ్మినా, పాత్రల సౌండ్ వచేసినా, గోకడం, గడియారంలోని ముల్లుల శబ్దం వంటి సౌండ్స్ వల్ల విపరీతంగా చిరాకు పడతారు. అయితే టీవీ సంగీతం లేదా రేడియో శబ్దాలకు పెద్దగా రియాక్ట్ అవ్వరు.

మిసోఫోనియా అంటే ఏంటి?

మిసోఫోనియా అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ జబ్బు ఉన్న వారికి కొన్ని రకాల శబ్దాల వల్ల చిరాగ్గా అనిపిస్తుంది లేదా విపరీతంగా ఇబ్బంది పడతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ప్రజలకు ఈ రుగ్మత ఉన్నట్టుగా తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెళ్లడైంది. ఇలాంటి శబ్దాల కారణంగా వాళ్లు విపరీతమైన కోపం లేదా చిరాకు, ఒత్తిడికి గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి మెదడులోని అంతర్గత ఇన్సులర్ కార్టెక్స్ చాలా చురుకుగా పని చేస్తుంది. మిసోఫోనియా రోగులు దగ్గు, తుమ్ము లాంటి ప్రత్యేకమైన చిన్న చిన్న శబ్దాలు విన్నా డిస్టర్బ్ అవుతారు. అందుకే ఈ జబ్బు ఉన్న చాలా మంది ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. ఒకవేళ చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్లతో చిరాగ్గా, కోపంగా ప్రవర్తిస్తారు. మిసోఫోనియా అనే జబ్బును 2000 సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా కనిపెట్టారు.

ఇటీవలి అధ్యయనంలో మిసోఫోనియాకు ఎటువంటి శాస్త్రీయ కారణాన్ని పూర్తిగా కనుగొనలేకపోయారు డాక్టర్స్. కరెంట్ బయాలజీ షెడ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యనం ప్రకారం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో 42 మందిని టెస్ట్ చేశారు. వారిలో 22 మంది మిసోఫోనియాతో బాధపడుతున్నారని తేలింది. ప్రస్తుతం ఇలాంటి శబ్దాలను విన్న తర్వాత మనిషి మెదడులో ఎలాంటి భావోద్వేగ ప్రక్రియ జరుగుతుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

- Advertisement -

మిసోఫోనియా లక్షణాలు…

మిసోఫోనియా తో బాధ పడుతున్న వ్యక్తి ఏమైనా శబ్దాలు వింటే విపరీతంగా కోప్పడతారు. తినడం, నమలడం, తుమ్ములు, శ్వాస తీసుకోవడం, గురక, త్రేన్పు, ఆవలించడం వంటి చిన్న చిన్న శబ్దాలు వాళ్లకు సమస్యలుగా అనిపిస్తాయి. అందుకే ఇతరులకు దూరంగా ఉండడం మొదలు పెడతారు. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.

మిసోఫోనియా చికిత్స..

సైకాలజిస్టులు ఈ మిసోఫోనియాతో బాధ పడుతున్న వ్యక్తులకు వాళ్ళ ప్రవర్తన, లైఫ్ స్టైల్ ను బట్టి కొన్ని మార్పులను సూచిస్తారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మస్ట్. వీటితో పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో మిసోఫోనియాను తగ్గించే ప్రయత్నం చేస్తారు వైద్యులు. అంతకు మించిన చికిత్సలేమి లేవు ఈ జబ్బుకు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు