Music Director : తనకంటే 7 ఏళ్లు పెద్దావిడను పెళ్లాడిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్… వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టిందంటే?

Music Director : ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మాటలను మనం తరచుగా వింటూ ఉంటాము. అయితే వాటిని నిజం చేసి చూపిస్తున్నారు పలువురు ప్రముఖులు. అందులో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఆయన భార్య ఏకంగా తనకంటే ఏడేళ్లు వయసులో పెద్దది. మరి ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడేళ్ళు ఏజ్ గ్యాప్?

ఇండస్ట్రీ లోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 2012లో తమిళ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఏంట్రీ ఇచ్చిన ఆయన తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నాక 2014లో బిర్లా రంగ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్లోకి మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగు పెట్టారు. కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో తిరిగి కోలీవుడ్ కే వెళ్లిపోయారు. అక్కడ వరసగా సినిమాలు చేసి పలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత మళ్లీ టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. నాని దసరా సినిమాతో 2023లో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. దసరా మూవీ ఆయన ఫేట్ ను మార్చేసింది. ఆ తర్వాత ఆయన చేసిన మరో రెండు సినిమాలు సైంధవ్, యాత్ర 2 చతికిలబడ్డాయి. కానీ రీసెంట్ గా కల్కి లాంటి సినిమాతో పాన్ ఇండియా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గ గా సక్సెస్ అయ్యారు. ఇది ఆయన కెరీర్లో 50వ సినిమా కావడం మరో విశేషం.

వ్యాసం_చిత్రం6

- Advertisement -

కాగా అసలు విషయంలోకి వెళ్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తనకంటే వయసులో ఏడేళ్లు పెద్దావిడని పెళ్లి చేసుకున్నారు. సంతోష్ నారాయణన్ వైఫ్ పేరు మీనాక్షి అయ్యర్. ఆమెకు అప్పటికే పెళ్లై విడాకులు కూడా తీసుకున్నారు. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే మీనాక్షి గాయని. ఆమె కర్ణాటక సింగర్. మద్రాస్ సినిమాలో టైటిల్ ట్రాక్ ను పాడింది ఈవిడే. వీరిద్దరి మధ్య మ్యూజిక్ పరంగా అభిరుచి కలవడంతో, అది కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే సంతోష్ నారాయణ జస్ట్ ఆమెను పెళ్లి చేసుకోవడంతో వదిలేయలేదు. అప్పటికే తనకున్న కూతురుని కూడా దత్తత తీసుకున్నారు.

ఈ స్టార్ సింగర్ సంతోష్ నారాయణన్ కూతురు

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సంతోష్ నారాయణన్ కూతురు ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ సింగర్. ఆమె ఎవరో కాదు దీక్షిత. దీక్షిత అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ రౌడీ బేబీ, ఎంజాయ్ ఎంజామీ సింగర్ అంటే ఆమెను ఇట్టే గుర్తు పడతారు. ఆమెను ముద్దుగా డి అని పిలుచుకుంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దీక్షిత సంతోష్ నారాయణన్ సొంత కూతురు కాదు. తన భార్య మీనాక్షి అయ్యర్ మొదటి భర్త వెంకటేశం కూతురు. ఆమెను సంతోష్ నారాయణన్ దత్తత తీసుకోవడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు