Naga Chaitanya Car Collection : అత్యంత కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన నాగ చైతన్య… ఇండియాలో ఈ కారు 15 మంది దగ్గర మాత్రమే…

Naga Chaitanya Car Collection : టాలీవుడ్ యౌన హీరో అక్కినేని నాగ చైతన్య గ్యారేజీలో ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లు, బైక్‌ల కలెక్షన్‌ ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఖాళీగా ఉన్న సమయంలో బైక్ రైడ్‌లకు వెళ్తూ ఉంటారు చై. తాజాగా పోర్షే 911 GT3RS అనే అత్యంత కాస్ట్లీ కారును కొన్నారు. తన హై-ఎండ్ కార్ కలెక్షన్‌లో సరికొత్త పోర్షేను యాడ్ చేశాడు. భారతదేశంలో దీని ధర రూ. 3.5 కోట్లకు పైగా ఉంది. నాగ చైతన్య సిల్వర్ మెటాలిక్ షేడ్‌తో కూడిన పోర్స్చే కారును కొనుగోలు చేశాడు. ఆయన కారు కొన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కారు ఇండియాలోని 15 మంది ప్రముఖుల దగ్గర మాత్రమే ఉండడం విశేషం.

హైదరాబాద్ లో ఇదే ఈ మోడల్ ఫస్ట్ కార్

పోర్షే సెంటర్ కార్ డీలర్‌షిప్ ఉన్న చెన్నైలోని ఓ షో రూమ్ నుంచి చై ఈ కారును కొన్నారు. చై తన సరికొత్త కారుతో పోజులిచ్చిన ఫోటోలను సదరు షో రూమ్ సంస్థ వారు పంచుకున్నారు. “మిస్టర్ అక్కినేని నాగ చైతన్యను పోర్స్చే కుటుంబానికి స్వాగతించడం, అతనికి ఈ కారును డెలివరీ చేసినందుకు సంతోషంగా ఉంది. GT3 RS అతనికి రేస్ ట్రాక్‌లో చిరస్మరణీయమైన అనుభవాలను అందించాలని కోరుకుంటున్నాము” అంటూ ఆ పోస్ట్ కు రాసుకొచ్చారు సమాచారం ప్రకారం ఈ కారు కోసం 2024 మే 17న రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మొదటి పోర్షే 911 GT3RS ఇదేనని తెలుస్తోంది.

కార్ ఫీచర్స్

రోడ్-గోయింగ్ 911 తో పోలిస్తే  కొత్త పోర్షే 911 GT3 RS కారు ఏరోడైనమిక్స్‌కు సరికొత్త అప్‌గ్రేడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్, రోడ్-గోయింగ్ 911లో అమర్చబడిన అతిపెద్ద బ్యాక్ వింగ్ ఉన్నాయి. ఈ రేసింగ్ అద్భుతమైన కారు ఫీచర్స్ విషయానికొస్తే.. పవర్ 4.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్ నుండి 518 bhp, 465 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 911 కంటే తక్కువ గేర్ రేషియోతో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వచ్చింది. ఈ కారు కారు 3.2 సెకన్లలో 100 kmph వేగంతో దూసుకెళ్తుంది. 0-200 kmph కేవలం 10.6 సెకన్లు పడుతుంది. గరిష్ట వేగం గంటకు 296 కిమీకి పరిమితం చేయబడింది.

- Advertisement -

అలాగే పోర్షే 911 GT3 RSలో రెగ్యులర్, స్పోర్ట్స్, ట్రాక్ అనే మూడు డ్రైవ్ మోడ్‌ లు ఉంటాయి. ఇతర అప్‌గ్రేడ్‌లలో కొత్త సైడ్ బ్లేడ్‌లు, వింగ్ ఇన్‌లెట్‌లు, వెనుక స్ప్లిటర్ ఉన్నాయి. ఈ మార్పులు 200 kmph వద్ద 409 కిలోల డౌన్‌ఫోర్స్‌ని తెస్తాయి. 284 kmph వద్ద 806 కిలోలకు చేరుకుంటాయి.

911 GT3 RS మొదటి సారి డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ (DRS)ని పొందింది. ఇది స్ట్రెయిట్-లైన్ వేగం, బ్రేకింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పోర్స్చే 36 mm మందం, 32 mm వెడల్పు కలిగిన పిస్టన్‌లతో పెద్ద ఫ్రంట్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. కర్బ్ వెయిట్ 1,450 కిలోలు. ఇది పాత 911 GT3 RS కంటే 20 కిలోలు ఎక్కువ.

నాగ చైతన్య లగ్జరీ కార్, బైక్ కలెక్షన్

నాగ చైతన్యకు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఎరుపు రంగు ఫెరారీ, నలుపు రేంజ్ రోవర్ డిఫెండర్ 110తో సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. సమాచారం ప్రకారం చైతన్య దగ్గర 3.88 కోట్లు విలువైన ఫెరారీ 488GTB కారు, 1.30 కోట్ల BMW 740 Li, 1. 18 కోట్ల విలువైన 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, 2. 12 కోట్ల విలువైన నిస్సాన్ GT-R కార్, 2. 28 కోట్ల విలువైన Mercedes Benz G-Class G 63 AMG, 35 లక్షల MV Agusta F4 బైక్, 18. 5 లక్షల BMW 9RT బైక్ ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు