Pan India Star : ఒకప్పుడు హోటల్లో వాటర్ బాటిల్స్ అమ్ముకున్న హీరో… ఇప్పుడు సొంత ఇండస్ట్రీ డైనమిక్స్ మార్చేసిన పాన్ ఇండియా స్టార్

Pan India Star : ప్రస్తుతం స్టార్స్ గా ఎంతోమందికి ఆదర్శనీయంగా మారిన సెలబ్రిటీలు ఈ స్థాయికి చేరుకోవడానికి ఊహించనంతగా కష్టాలను పడి ఉంటారు. ఇలాగే ఓ స్టార్ హీరో సినిమాల్లోకి రావడానికంటే ముందు హోటల్లో పని చేసి, వాటర్ బాటిల్స్ ను అమ్ముకునేవాడు. కానీ ప్రస్తుతం అదృష్టం కలిసి వచ్చి సొంత సినీ పరిశ్రమ డైనమిక్స్ ని పూర్తిగా మార్చేసిన పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. గాడ్ ఫాదర్ లేకుండా సినిమా పరిశ్రమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సక్సెస్ ఫుల్ గా ఏర్పరచుకున్న ఆ పాన్ ఇండియా స్టార్ స్టోరీ ఏంటో చూద్దాం పదండి.

వాటర్ బాటిల్స్ అమ్ముకోవడం నుంచి పాన్ ఇండియా స్టార్ గా

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న స్టార్ హీరో ఇప్పుడు కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ఇప్పుడంటే ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ రిషబ్ ఈ రేంజ్ కు చేరుకోవడానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు కాంతారా హీరో ఒక్కో మెతుకు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వాటర్ క్యాన్లు అమ్ముకోవడంతో పాటు హోటల్ లో కూడా పని చేశాడు.

Rishab Shetty on Kantara: Local cinema is the new global - Entertainment News | The Financial Express

- Advertisement -

1983 జూలై 7న దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరులో జన్మించాడు రిషబ్ శెట్టి. కర్ణాటకలోని పాఠశాల విద్యను పూర్తి చేసిన రిషబ్ బీకాం డిగ్రీని బెంగళూరులోని ఓ కళాశాలలో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో కళాశాలలో ఉన్నప్పుడు నాటకాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ నుండి ఫిలిం డైరెక్షన్ లో డిప్లొమా సంపాదించాడు. నటుడు కావాలనుకున్నప్పటికీ ఆయనకు అవకాశాలు రాలేదట. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో పాటు ఎవరిని ఎలా సంప్రదించాలో ఆయనకు తెలియదట.

క్లాప్ బాయ్ గా సినీ ప్రయాణం

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత పరిచయాలు సంపాదించి, కొన్ని సైడ్ క్యారెక్టర్లు చేసి, అప్పుడు హీరోగా ఎదిగారు. అయితే అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు ఫస్ట్ క్లాప్ బాయ్, స్పాట్ బాయ్ వంటి పనులు చేశాకే అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత తుగ్లక్ మూవీలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన రిక్కీ సినిమాతో రిషబ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి కన్నడ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2022లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. 2017లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రగతి శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రన్విత్ శెట్టి, కుమార్తె రాద్యా శెట్టి ఉన్నారు. ప్రగతి శెట్టి ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. ఇప్పటికే పలు సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ కూడా చేసింది. ఏదేమైనా రిషబ్ శెట్టి జీవిత కథ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు