Personality Development : ఆఫీస్ లో విమర్శలను ఎలా ఎదుర్కోవాలంటే?

Personality Development : విమర్శలను ఎదుర్కోవడం అనేది చిన్న విషయమేమి కాదు. ఆఫీస్ లో లేదా వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెట్టే చెడు మాటలు లేదా విమర్శలను వినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ వాటి వల్ల మనసుకు బాధ కలుగుతుంది. మనుషుల మధ్య చాలా సార్లు అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. చాలా సందర్భాలలో ఈ విమర్శలే ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు స్టార్ట్ కావడానికి కారణం అవుతాయి. అయితే చాలా మంది విమర్శలను వ్యక్తిగత దాడిగా భావిస్తారు. కానీ ప్రతి విమర్శ వెనుక అదే ఉద్దేశం ఉంటుందని చెప్పలేము.

ఎవరైనా మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? దాని వెనుక ఉన్న ఉదేశ్యం ఏంటి ? అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా విమర్శల వెనుక కారణాలను అర్థం చేసుకునేంత వరకు మనం అవతలి వ్యక్తులను నిందిస్తూనే ఉంటాం. దీనితో పాటు మిమ్మల్ని విమర్శించే వాళ్ళను అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. అయితే ఈ విమర్శలను ఎదుర్కోవాలి అంటే ముందుగా పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి. అసలు ఈ విమర్శలను ఎలా మేనేజ్ చెయ్యాలి అంటే మైండ్ కోచ్, సైకాలజిస్టులు లు చెప్పే కొన్ని ముఖ్యమైన టిప్స్ ను ఫాలో అవ్వాలి.

ప్రశాంతమైన ప్రవర్తన

ఎవరైనా విమర్శిస్తే చెంప పగల గొట్టేంత కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ ఎదుటి వ్యక్తి పట్ల ఏ విధంగానూ కోపంగా స్పందించకండి. పాజిటివ్ గా ఆలోచిస్తూ విమర్శలను ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధంగా ఉంచుకోండి.

- Advertisement -

ప్రతి విమర్శ ఒక లెసన్

ప్రతి విమర్శ ఏదో ఒక పాఠం నేర్పుతుందని చెప్తారు సైకాలజిస్టులు. తెలివైన వ్యక్తి విమర్శలు ఎదురైనప్పుడు కోపం తెచ్చుకోరు. విమర్శకుల మాటలను సులభంగా అంగీకరిస్తారు. విమర్శ అంటే హృదయాన్ని గాయపరచడమే కాదు తప్పులను ఎత్తి చూపడం కూడా. మీ తప్పులను మీరు తెలుసుకున్నప్పుడు మళ్ళీ అది రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇలా విమర్శలు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కు హెల్ప్ అవుతాయి అన్నమాట. కానీ అది విమర్శలను పాజిటివ్ గా తీసుకున్నప్పుడే అర్థం చేసుకోగలుగుతారు.

సానుకూల దృక్పథం

పాజిటివ్ థింకింగ్ తో విమర్శలను ఎదుర్కోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విమర్శలు మూడ్‌ని మారుస్తాయనేది నిజం. కానీ అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం వల్ల అవి మిమ్మల్ని బాధించలేవు, కాబట్టి ఎమోషన్స్ ను అదుపులో పెట్టుకోండి. అనవసరంగా అవతలి వ్యక్తి గురించి మనసు పాడు చేసుకోవద్దు. .

అభిప్రాయాన్ని తీసుకోవడం మంచిదే

విమర్శలను తప్పుగా తీసుకోకుండా ఫీడ్‌ బ్యాక్ గా తీసుకోవాలని సైకాలజీ నిపుణులు చెప్తున్నారు. మీకు నచ్చక పోతే వాళ్ళ మాటలను అక్కడితో వదిలేస్తే సరిపోతుంది. విమర్శ మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో సహాయపడుతుంది. ఈ టిప్స్ ను ఫాలో అయితే ఆఫీస్ లో, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా మరింతగా ఎదుగుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు