Personality Development : మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే దేనికీ పనికిరారు

ఇలాగే ఉంటే పెద్దయ్యాక దేనికి పనికి రాకుండా పోతావ్… చిన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు తింటే తిట్లలో ఇది కూడా ఒకటి. తమ పిల్లలు ఒక వయసుకు వచ్చాక బాధ్యతల విలువ ఏంటి? వాటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలని, లేజీ గా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా అంటూ ఉంటారు. అయితే పెద్దయ్యాక కూడా మీలో కొన్ని లక్షణాలు ఉంటే కచ్చితంగా వాళ్ళు అన్నట్టుగానే దేనికి పనికిరాకుండా పోతారు. ముఖ్యంగా సోమరితనం. లేజీగా ఉండడానికి, ఏదైనా ఒక విషయాన్ని తేలికగా తీసుకోవడానికి మధ్య తేడా ఉంటుంది. సోమరితనం అంటే జీవితంలో ఎదగడానికి తమకు తామే అడ్డుగా ఉన్నట్టు. మరి ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి? మీకు కూడా ఆ లేజి హ్యాబిట్స్ ఉన్నాయా? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న లక్షణాలు మీకు కూడా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సిందే.

1. పోస్ట్ పోన్ చేయడం
వాయిదా వేయడం అనేది సోమరితనానికి పర్యాయపదం అని చెప్పొచ్చు. ప్రతిసారి ఏదో ఒక సాకుతో పనిని వాయిదా వేస్తూ ఉంటారు. చివరి నిమిషంలో ఆ పనిని పూర్తి చేయడానికి టెన్షన్ పడుతూ ఉంటారు. నిజానికి పనులను తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నామని అనుకుంటారు. కానీ అదే అలవాటుగా మారి లైఫ్ ను మనకు తెలియకుండానే డేంజర్ లోకి నెట్టేస్తుంది. ఫలితంగా జీవితంలో ఎదగడం అనేది అసాధ్యంగా మారిపోతుంది.

2. రొటీన్ రొటీన్ గా లేకపోవడం
రొటీన్ అనేది రొటీన్ గా ఉన్నప్పుడే ఒక పద్ధతిలో పనులు చేసుకోగలుగుతాం. ఏదైనా తేడా వచ్చి అస్తవ్యస్తంగా మారిపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రొటీన్ ను ఫాలో అవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం, నచ్చినప్పుడు తినడం వంటివి చేస్తున్నారు అంటే కచ్చితంగా లేజీ గా మారుతున్నారని అర్థం.

- Advertisement -

3. శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం
సోమరితనం అనగానే ఏమి చేయకుండా ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం అని అనుకుంటాం. అదే నిజం కూడా. అయితే శరీరానికి తగినంత శ్రమను ఇవ్వకపోయినా బద్దకంగా ఫీల్ అవుతారు. శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల శక్తి తగ్గిపోతుంది. అలసటగా, నీరసంగా ఉంటారు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శక్తి మరింతగా పెరగడంతో పాటు మానసిక స్థితి కూడా బెటర్ అవుతుంది.

4. సెల్ఫ్ డెవలప్మెంట్ ని పట్టించుకోకపోవడం
వ్యక్తిగత ఎదుగుదల అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లో సక్సెస్ ఫుల్ అవ్వడానికి ఒక కీలకమైన మెట్టు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ఎఫర్ట్, కమిట్మెంట్, ఇష్టం అనేవి ఉండాలి. లేజీగా ఉండే వ్యక్తులు ఈ అంశాన్ని అస్సలు పట్టించుకోరు. చాలెంజ్ ను స్వీకరించడానికి లేదా కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడానికి ఇష్టపడకుండా తమ కంఫర్ట్ జోన్లలోనే ఉండడానికి ఇష్టపడతారు.

5. పరధ్యానంలో మునిగిపోవడం
ఎప్పుడు చూసినా సోషల్ మీడియా, టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వంటివి చేస్తూ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక లిమిట్ లో చేస్తే తప్పులేదు. కానీ చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి వాటిపై కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల జీవితంలో ఎదగలేరు.

6. కాన్ఫిడెన్స్ లేకపోవడం
మిమ్మల్ని మీరు నమ్మడం అనేది విజయాన్ని సాధించడానికి కావాల్సిన కీలకమైన విషయం. ఇది మీరు ఇన్స్పైర్ అయ్యేలా చేసి, పట్టుదలగా లక్ష్యం వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది. ఎదురుదెబ్బలను తట్టుకోవడానికి ఆసరా అవుతుంది.

7. బాధ్యతల నుంచి తప్పించుకోవడం
బాధ్యతల నుంచి దూరంగా పారిపోవడం ఒత్తిడి, ఆందోళన కారణంగా జరుగుతుంది. అలాగే ఇది సోమరితనం మాత్రమే కాదు భయం కూడా పాతుకుపోయి ఉంటుంది. ఫెయిల్ అయితే విమర్శలను తట్టుకోగలమా అని భయం. కానీ ఆ భయాన్ని అధిగమించినప్పుడే జీవితం మారుతుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ మొదలవుతుంది.

8. సెల్ఫ్ డిసిప్లిన్ ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవ్వడం, ఫోకస్ చేయడం, రూల్స్ ను ఫాలో అవ్వడం వంటి క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు. లేదంటే మీరు కన్న కలలు కలలుగానే ఉండిపోతాయి. అంతేకాకుండా కష్టపడడానికి ఇబ్బంది పడే వ్యక్తులు జీవితంలో ఎన్నటికీ ఎదగలేరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు