Prithviraj Sukumaran : పృథ్వీరాజ్ మరీ ఇంత రిచ్చా… ఈ లగ్జరీ కారు కోసం అంత ఖర్చు చేశారా?

Prithviraj Sukumaran : వరాదరాజ మన్నార్ గా సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్. తాజాగా ఆయన గ్యారేజీలోకి మరో కొత్త లగ్జరీ కారు వచ్చి చేరింది. మరి ఆ కారు కాస్ట్ ఎంత ? ఫీచర్స్ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పృథ్వీరాజ్ గ్యారేజీలో కొత్త కారు

ప్రస్తుతం మలయాళ చిత్ర సీమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ తాజాగా ఓ కొత్త కారు కొన్నాడు. అత్యాధునిక లగ్జరీ కార్లంటే ఆయనకు దాదాపుగా పిచ్చి అని చెప్పవచ్చు. ఇప్పటికే పృథ్వీరాజ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోర్షే 911 GT3 టూరింగ్ అనే కొత్త కారును ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే పృథ్వీరాజ్ ఈ అత్యాధునిక పోర్షే కారును కొన్నాడు. గత 3, 4 నెలల క్రితం బుక్ చేసుకున్న ఈ కారు ఇప్పుడు డెలివరీ అయింది. పోర్షే ఇండియా కూడా తన సోషల్ మీడియా పేజీలలో దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.

పోర్షే 911 GT3 టూరింగ్ ప్రారంభ ధర దాదాపు రూ. 2.75 కోట్లు. పోర్షే ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు కావాలంటే 3 నుంచి నాలుగు నెలలు వెయిటింగ్ తప్పదు. నిన్న కంపెనీ పృథ్వీరాజ్‌కి కారును అందజేసినప్పుడు అతని భార్య కూడా అక్కడే ఉంది. పోర్షే విడుదల చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

- Advertisement -

Prithviraj Sugumaran : யாரா இருந்தாலும் வெயிட் பண்ணனும் சார்.. சில மாத காத்திருப்பு - இறுதியில் புது Porsche வாங்கிய Prithviraj!

కారు ఫీచర్స్

జర్మన్ సూపర్ కార్ అయిన పోర్షే స్పోర్ట్స్ కార్ మోడల్ 911 జి.టి.3 టూరింగన్ ఇప్పుడు పృథ్వీరాజ్ గ్యారేజ్‌లోకి చేరిన కొత్త కారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌ కావడం దీనిలోని స్పెషల్ అట్రాక్షన్. దీని విలువ దాదాపు 3.20 కోట్ల రూపాయలు. అయితే వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా దీనిని కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆయా కస్టమైసేషన్‌ల ఆధారంగా ఈ కారు ధర ఉంటుంది. మరి పృథ్వీరాజ్ ఈ కారును ఎలా కస్టమైజ్ చేయించుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ మోడల్ కారు ఇండియాలో అతి తక్కువ మంది వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంది. కేవలం 3.9 సెకనులో 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ కారు గరిష్ట వేగం గంటకు 320 కి.మీ.

పృథ్వీరాజ్ కార్ కలెక్షన్

ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత సుకుమారన్ వారసుడే పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటుడు మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడు కూడా. పృథ్వీరాజ్ సుకుమారన్ 2019లో లూసిఫర్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా గ్యారేజీలో ఇప్పటికే పలు లగ్జరీ కార్లు కొలువుదీరాయి. లంబోర్గిని ఉరుస్, బి.ఎమ్.డబ్ల్యు సేవాన్ సీరియస్, మెర్సిడెజ్ బెంజ్ జి-వాగన్, మినీ కూపర్ మొదలగు కార్లు ఉండగా, తాజాగా ఆ లిస్ట్ లోకి పోస్చె కూడా చేరింది. పృథ్వీ రాజ్ చివరిసారిగా ఆడుజీవితం సినిమాతో థియేటర్లలో సందడి చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు