Samantha : సామ్ డైట్ సీక్రెట్ రివీల్… అందుకేనా ఇంత ఫిట్ గా ఉంటుంది?

Samantha : చాలా మంది హీరోయిన్లు తమ శరీర బరువును కాపాడుకోవడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి వివిధ వ్యాయామాలు, ఆహార నియమాలను పాటిస్తున్నారు. అలాగే సౌత్ క్వీన్ సమంత తన నటనతోనే కాకుండా ఫిట్ బాడీ, మెరిసే ముఖంతో కోట్లాది మంది అభిమానులను ఆకర్షిస్తోంది. సమంత తన ఆరోగ్యం కోసం హెల్దీ డైట్, వ్యాయామాలను ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన డైట్, ఫిట్‌నెస్ రొటీన్ సీక్రెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సామ్ ఫిట్నెస్ సీక్రెట్

సమంతా రూత్ ప్రభు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన రొటీన్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని  పంచుకుంది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సామ్ తన బ్యాలెన్స్‌డ్ లంచ్ మెనూని బయట పెట్టేసింది. ఆమె పోస్ట్ చూస్తే ప్రోటీన్, ఫైబర్, ప్రోబయోటిక్‌ ఎక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకుంటోంది అని అన్పిస్తోంది. నెక్స్ట్ స్టోరీస్ లో సామ్ తన బరువును కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఎలాంటి శిక్షణ తీసుకుంటుందో వెల్లడించింది. సెషన్ 1 అంటూ ఫుడ్ గురించి రివీల్ చేసింది. తరువాత రాకేష్ యాదవ్‌తో ఆమె మార్షల్ ఆర్ట్స్ సెషన్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ “సెషన్ 2 మార్షల్ ఆర్ట్స్” అని రాసింది. రాకేష్‌తో ఫోటోకి పోజులిచ్చేటప్పుడు ఆమె సంతోషంగా, నవ్వుతూ కనిపించింది. ఈ సెషన్లు చూస్తుంటే ఆమె రోజూ సెషన్ల పేరుతో తన అభిమానులకు ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించబోతోందా ? అన్పిస్తోంది.

ఇన్స్టాగ్రామ్

- Advertisement -

ఇదిలా ఉండగా సమంత ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు చేసి తన శక్తిని మరింత మెరుగుపరుచుకుని ఫిట్ గా మారుతోంది. ఇది ఆమె శరీరానికి కావలసినంత ఫిట్నెస్ ను అందించడమే కాకుండా తన చర్మం సహజ మెరుపుతో కాంతులీనడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన, శక్తివంతమైన చర్మానికి హెల్ప్ చేస్తుంది.

ఇక డైలీ రొటీన్ విషయానికొస్తే సామ్ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటుంది. లంచ్ కోసం సమంత సాంప్రదాయ, పోషకాహారాన్ని తింటుంది. సాధారణంగా బ్రౌన్ రైస్, తక్కువ నూనెలో వండిన వంటలను, పప్పులను తింటుంది. లంచ్, డిన్నర్ లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకుంటుంది. సాయంత్రం సమయంలో సమంతా తేలికపాటి, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఇష్టపడుతుంది. గ్రీన్ టీ, కొన్ని పండ్లు తింటుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. సమంత రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తీసుకుంటుందట. రాత్రి భోజనంలో ఉడికించిన వెజిటబుల్ సూప్ మాత్రమే తీసుకుంటుందని తెలుస్తోంది.

సినిమాలకు గ్యాప్, రీ ఎంట్రీ

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత గత ఏడాది నటన నుంచి సుదీర్ఘ విరామం తీసుకుంది. సమంత చివరిసారిగా 2023లో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో కనిపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె పుట్టిన రోజున మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించింది. స్వయంగా సామ్ ఈ సినిమాతో నిర్మాతగా మారబోతోంది. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు సమంత షారూఖ్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయబోతోందని టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు