Senior Actor : ఈ పాపులర్ నటుడు హైదరాబాద్ హోటల్లో వెయిటర్ గా పని చేశాడన్న సంగతి తెలుసా?

Senior Actor : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్లుగా వెలిగిపోతున్న ప్రతి నటి, నటుడు ఆ స్థాయికి చేరుకోవడానికి కచ్చితంగా కష్టపడే ఉంటారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ సీనియర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఓ పాపులర్ సీనియర్ నటుడు కెరీర్ మొదట్లో వెయిటర్ గా పని చేశారట. అది కూడా హైదరాబాద్ రెస్టారెంట్ లోనే కావడం విశేషం. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఎక్కడ పని చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

హోటల్లో వెయిటర్ గా…

తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన పాత్రలతో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాజర్. హీరోగా, అన్నగా, తండ్రిగా, తాతగా… ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ కెరీర్ మొదట్లో ఆయన కూడా సినిమా కష్టాలను అనుభవించారట. ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొన్నాళ్లు అవకాశాలే రాలేదట. దీంతో సినిమా అవకాశాలను పక్కన పెట్టి హోటల్లో వెయిటర్ గా పని చేశారట.

ఓ ఇంటర్వ్యూలో నాజర్ మాట్లాడుతూ తమ బ్యాచ్ లో తనకు వెంటనే అవకాశాలు దొరకలేదని, కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలే వచ్చేవన్నీ గుర్తు చేసుకున్నారు. ఇక అప్పట్లో షూటింగ్ కు వెళ్లాలంటే ఇంటి దగ్గర నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరాలని, కానీ అంత ఉదయాన్నే తన తల్లికి వంట చేయడం కుదరకపోవడంతో కొన్నిసార్లు అన్నం మాత్రమే బాక్స్ లో పెట్టుకుని వెళ్లేవాడినని చెప్పారు. అయితే అప్పట్లో చిరంజీవితో పాటు ఇతర ఇతర నటులకు కూడా ఓ మెస్ నుంచి భోజనాలు వచ్చేవని, అందుకే వాళ్ళు తనకు కూరలు, సాంబార్ వంటివి ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూసే వాడినని అన్నారు. అలా ఓ రోజు అన్నం తెచ్చుకుని తింటుంటే చిరంజీవి దగ్గరకొచ్చి నువ్వు కూడా మాతో కలిసి భోజనం చెయ్ అని ఆహ్వానించారట. అలా అప్పట్లో ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు చిరంజీవితో కలిసి భోజనం చేసేవారట. కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తాజ్ కోరమాండల్ హోటల్ లో వెయిటర్ గా పని చేయడం మొదలు పెట్టారట.

- Advertisement -

The rocky road to fame - The Hindu

మెగాస్టార్ ఆఫర్ రిజెక్ట్

అవకాశాలు రాకపోవడంతో ఒకానొక టైంలో నిరాశకు గురై సినిమాలే జీవితం కాదని ఫిక్స్ అయ్యారట నాజర్. అందుకే నెల జీతం తీసుకుంటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే మంచిది అనిపించి హైదరాబాద్ లోనే తాజ్ కోరమండల్ హోటల్ లో వెయిటర్ గా చేరారట. అలా పని చేస్తున్న క్రమంలో చాంబర్లో షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని బ్రేక్ టైంలో అక్కడికి వెళ్లారట. అయితే చిరంజీవి గమనించి విషయం తెలుసుకుని అవకాశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారట. కానీ ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆయన పిలిచినప్పటికీ వెళ్ళలేదట నాజర్. ఇక ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు పెరిగి మంచి పాపులారిటీగా దక్కించుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేకపోయారు. అయితే ఖైదీ నెంబర్ 150లో పాత్ర చిన్నదే అయినప్పటికీ మెగాస్టార్ కోసం నాజర్ ఒప్పుకున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు