Sonakshi Sinha Saree Cost : సోనాక్షి సిన్హా రిసెప్షన్ శారీ ధర ఇంతేనా?

Sonakshi Sinha Saree Cost : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా ఆమె పెళ్లి, రిసెప్షన్ చీర గురించిన వార్తలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ఆమె చీర గురించి హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె పెళ్లి చీర ఖరీదు ఎంత ? అనే వివరాల్లోకి వెళ్తే…

44 ఏళ్ల క్రితం నాటి చీరలో పెళ్లి

నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జకీర్ ఇక్బాల్‌ను జూన్ 23 ఆదివారం నాడు పెళ్లి చేసుకున్నారు. జహీర్ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి కావడంతో వీరి ప్రేమకు మొదట సోనాక్షి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని టాక్ నడుస్తోంది. ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో సోనాక్షి, జహీర్ పెళ్లి చేసుకున్నారు. కాగా సోనాక్షి – జహీర్‌ల పెళ్లి చాలా సింపుల్‌గా శత్రుఘ్న సిన్హా ఇంట్లో జరిగింది. అది కూడా రిజిస్టర్డ్ వెడ్డింగ్‌ కావడం విశేషం. పెళ్ళికి అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక వెడ్డింగ్ డే రోజున సోనాక్షి నగలు, ఆమె కట్టుకున్న చీర స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. అవి ఆమె తల్లివి కావడం మరో ఆసక్తికరమైన విషయం. 44 ఏళ్ల క్రితం శతృఘ్న సిన్హాను పెళ్లి చేసుకున్నప్పుడు పూనమ్ సిన్హా కట్టుకున్న చీరనే తన పెళ్లికి సెంటిమెంట్ గా సోనాక్షి కట్టుకుంది. ఇది పూర్తిగా వెండి దారం ఎంబ్రాయిడరీతో కూడిన ఐవరీ చీర. ఈ చీరకు సరిపోయేలా ఆమె తన తల్లి సంప్రదాయ ఆభరణాలను ధరించింది.

Inside Zaheer Iqbal-Sonakshi Sinha wedding: Zaheer kisses his bride, touches Shatrughan Sinha and Poonam Sinha's feet. Watch | Bollywood News - The Indian Express

- Advertisement -

రిసెప్షన్ చీర ధర ఎంతంటే ?

పెళ్లి తరువాత అదే రోజు సాయంత్రం జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సోనాక్షి ఎరుపు రంగు బనారసీ సిల్క్ చీరలో అద్భుతంగా కనిపించగా, జహీర్ తెల్లటి కోటు సూట్ ధరించాడు. సోనాక్షి వెడ్డింగ్ రిసెప్షన్ రోజు కట్టుకున్న ఈ చీర ధర రూ.79,800 అని అంటున్నారు. దీంతో ఈ కాస్ట్ తెలుసుకుని ఆ చీర ఇంత తక్కువ ధరా ? ఆమె అభిమనులతో సహా మూవీ లవర్స్ షాక్ అవుతున్నారు.

శత్రుఘ్న సిన్హా నటుడు, రాజకీయ నాయకుడు. సోనాక్షి తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హిందీ చలనచిత్ర సీమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొత్తంగా చూసుకుంటే మంచి ధనవంతుల ఇంటి వారసురాలిగా కనిపించే సోనాక్షి, పెళ్లిలో తల్లి చీర, రిసెప్షన్‌లో సాధారణ బనారసీ చీరను ధరించి ప్రేక్షకులను షాక్ చేసింది. నిజానికి ఎలాంటి స్పెషల్ ఈవెంట్ జరిగినా ప్రముఖ నటీమణులు తమ సొంత డిజైనర్‌ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవడం అనేది ఆనవాయితీ. తన సౌలభ్యం, హోదాను చూపించుకోవడానికి బంగారు వస్త్రాలు ధరించి, వజ్రాభరణాలు ధరించవచ్చు. కానీ అలా చేయకుండా సోనాక్షి ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడం, పెళ్ళిలో ఆమె సింప్లిసిటీ చాలా మందిని ఆకర్షించిందని చెప్పవచ్చు. కాజోల్, సల్మాన్ ఖాన్, రేఖ, అనిల్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, హుమా ఖురేషి, సైరా బాను వంటి పలువురు ప్రముఖులు సోనాక్షి వివాహానికి హాజరయ్యారు. ఆమే రిసెప్షన్‌కు దాదాపు 1,000 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు