HBDSudigaliSudheer: సుడిగాలి సుధీర్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా ?

HBDSudigaliSudheer: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సుడిగాలి సుదీర్ ఒకరు. బుల్లితెరపై ప్రయాణాన్ని ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే తనలోని అన్ని టాలెంట్లను చూపించుకున్నాడు సుడిగాలి సుదీర్. ఈ నేపథ్యంలోనే బిగ్ సెలబ్రిటీగా మారిపోయాడు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ షో ద్వారా హైలెట్ అయిన అతడు కమెడియన్ గా, యాంకర్ గా, డాన్సర్ గా, సింగర్ గా, హీరోగా తనలోని ఎన్నో యాంగిల్స్ ను చూపించి సక్సెస్‌ అయ్యాడు.

ఇక 2019లో వచ్చిన “సాఫ్ట్వేర్ సుధీర్” సినిమాతో కథా నాయకుడిగా మెరిసాడు సుడిగాలి సుదీర్. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడిందని చెప్పవచ్చును. ఆ తర్వాత “త్రీ మంకీస్”, “వాంటెడ్ పండుగాడు” వంటి సినిమాలు తన కెరీర్ కు ఉపయోగపడని సినిమాలు చేశాడు. ఆ నెక్స్ట్ చేసిన “గాలోడు” సినిమా సుడిగాలి సుదీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ సక్సెస్ అయింది. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో GOAT అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తనకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సుడిగాలి సుదీర్. కాగా సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెబుతున్నారు.

- Advertisement -

అయితే సుడిగాలి సుదీర్ ఆస్తులు 6 కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. సుడిగాలి సుదీర్ ఏడాదికి 50 లక్షల నుంచి 80 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. అలాగే హైదరాబాద్ మహానగరంలో బిల్డింగ్ కూడా కొనుగోలు చేశాడట సుడిగాలి సుదీర్. ప్రస్తుతం హైదరాబాదులోని మణికొండ లో ఉంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు