Tamannah : అంబానీ పెళ్ళిలో అందరి కళ్ళూ ఆమెపైనే… తమన్నా డ్రెస్ కాస్ట్ ఇంతేనా!?

Tamannah : అనంత్ అంబానీ పెళ్ళిలో ఎంతోమంది తారలు తళుక్కున మెరిశారు. అయితే ఇంతటి కాస్ట్లీ వెడ్డింగ్ కి ఇన్విటేషన్ అందితే ఆ హంగూ, ఆర్భాటం ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ఎంత రిచ్, తమ స్థాయి ఏంటి అని చూపించుకోవడానికి ఇదే మంచి వేదిక అవుతుంది. అందుకే కోట్ల ఖరీదు చేసే నెక్లెస్ లు, ఊహించని రేంజ్ లో ఖరీదు చేసే బట్టలు వేసుకుని హంగామా చేస్తారు. కానీ తమన్నా మాత్రం తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది. తాను వేసుకున్న ఆ అద్భుతమైన లెహంగా ధర తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.

అందరి కళ్ళూ ఆమెపైనే..

ఆదివారం ముంబైలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిర్వహించిన ‘మంగళ ఉత్సవ్’కు తమన్నా భాటియా హాజరయ్యారు. చాలామంది తారలు ఈ వేడుకకు విచ్చేసినా తమన్నానే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మిల్కీ బ్యూటీ బ్లాక్ అండ్ గోల్డ్ ట్రెండ్‌ లెహంగాను ధరించి, అందరి దృష్టిని ఆకర్షించింది. ‘టోరానీ’ రూపొందించిన ఆ డిజైనర్ లెహంగా ధర రూ. 3.85 లక్షలు మాత్రమే.

Video: अनंत अंबानी के रिसेप्शन में बन-ठनकर पहुंचीं तमन्ना भाटिया, डार्क ब्लू गोल्डन लहंगे में छाया किलर लुक - News18 हिंदी

- Advertisement -

తమన్నా ధరించిన ఆ డిజైనర్ లెహంగా ఓ వెబ్‌సైట్‌లో కొనుక్కోవడానికి అందుబాటులో ఉంది. దీనికి ‘భద్ర నాలికా లెహంగా’ అని పేరు పెట్టారు. తమన్నా ఈ ఈవెంట్‌లో తన ఓల్డ్ స్కూల్ లుక్ తో పాతకాలపు బాలీవుడ్ సినిమాలోని తారలా అందంగా కనిపించింది. ఆమె వింటేజ్ లుక్ కు అందరూ ఫిదా అయ్యారు. తమన్నా లెహంగా ఒక మత్స్యకన్య స్టైల్ లో ఉంది. తమన్నా చిన్న బ్లౌజ్, భారీ దుపట్టా, మ్యాచింగ్ బ్లాక్ పొట్లీతో స్టేట్‌మెంట్ లెహెంగాను స్టైల్ చేసింది. ఆ డ్రెస్ పైకి ఆమె వేసుకున్న మేకప్ అద్భుతంగా ఉంది. సున్నితమైన బంగారు జుమ్కీలు, మిడ్ సైజ్ మాంగ్-టికా వంటి ఆభరణాలతో ఆమె లుక్ అదిరిపోయిందంతే. సాధారణంగానే తమన్నా సౌత్ లో ఫ్యాషన్ ఐకాన్ లాంటిది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ తో అబ్బుర పరుస్తూ ఉంటుంది. కాగా కొంతమంది అనంత్ అంబానీ పెళ్లిలో తమన్నా ధరించిన ఆ లెహంగా, ఆమె స్టైల్ ను చూసి అచ్చం సంజయ్ లీలా భన్సాలి హీరామండిలో హీరోయిన్ల లుక్ ను గుర్తు చేసుకుంటున్నారు.

అనంత్ అంబానీ, రాధిక పెళ్లి రిసెప్షన్ గెస్ట్ లిస్ట్

అనంత్ అంబానీ, రాధిక వివాహ రిసెప్షన్‌లో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గోవింద, సన్నీ డియోల్, బాబీ డియోల్, మధుర్ భండార్కర్, సుభాష్ ఘాయ్, రాజ్‌కుమార్ రావ్-పత్రలేఖ, బిపాషా బసు-కరణ్ సింగ్ గ్రోవర్, అర్జున్ కపూర్, డయానా పెంటీ, అట్లీ, జాకీ భగ్నానీ-రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, తమన్నా, విజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక మార్చి నుంచి జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు ఈరోజుతో బ్రేక్ పడనుంది. రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, నాలుగు రోజుల పెళ్లి వేడుకల్లో అంబానీ కుటుంబం జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు